ఆదిలాబాద్ జిల్లా ఓ యువరైతు సాగు కలసిరాక ఆత్మహత్య చేసుకున్నాడు. కలహారి గ్రామానికి చెందిన ఎస్.మాధవ్ (32) పత్తి, టమాటా సాగు చేశాడు.
గుడిహత్నూరు: ఆదిలాబాద్ జిల్లా ఓ యువరైతు సాగు కలసిరాక ఆత్మహత్య చేసుకున్నాడు. కలహారి గ్రామానికి చెందిన ఎస్.మాధవ్ (32) పత్తి, టమాటా సాగు చేశాడు. నీరు లేక పోవడంతో మూడు బోర్లు వేయించాడు. అయినా చుక్కనీరు పడలేదు. పంటల దిగుబడి తగినంత రాకపోవడంతో మనస్తాపం చెందిన మాధవ్ గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. అతడ్ని కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.