
వేణు మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు
దస్తూరాబాద్(కడెం) : అప్పుల బాధతో దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ పంచాయతీ పరిధి చెన్నూర్‌కు చెందిన రైతు కొట్టె వేణు (32)మంగళవారం సాయంత్రం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోగా, ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడా పని దొరకక పోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకుని ఖరీఫ్‌లో వరి సాగు చేశాడు. దోమపోటుతో దిగుబడి తగ్గి మళ్లీ నష్టపోయాడు. రూ.5లక్షలు అప్పులుండడంతో తీర్చే మార్గంలేక మనస్తాపంతో మంగళవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.