debts worry
-
తమ్ముడి కుటుంబం సూసైడ్.. అన్నకు చెప్తామని వెళ్లేసరికి..!
సాంగ్లి: మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన పెను విషాదంలో అసలు విషయం తేలింది. ఇద్దరు అన్నదమ్ములు తమ తమ భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 9 మంది చనిపోయారు. అప్పుల భారంతోనే వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎంహైసల్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పొపట్ వాన్మొరె(56) ఉపాధ్యాయుడు కాగా, మానిక్ వాన్మొరె వెటర్నరీ డాక్టర్. వీరిద్దరూ తమ కుటుంబాలతో గ్రామంలోనే వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం మానిక్ వాన్మొరె ఇంటి తలుపులు తీయకపోయేసరికి చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. ఆ ఇంట్లో మానిక్ సహా నలుగురి మృతదేహాలు కనిపించాయి. విషయం చెప్పేందుకు పొపట్ ఇంటికి వెళ్లిన గ్రామస్తులకు ఇదే అనుభవం ఎదురైంది. మానిక్ ఇంట్లో మానిక్, ఆయన భార్య, తల్లి, కూతురు, పొపట్ కొడుకు విగత జీవులై కనిపించగా, అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పొపట్ ఇంట్లో పొపట్, ఆయన భార్య, కూతురు శవాలై పడి ఉన్నారు. వీళ్లంతా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ధృవీకరించారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల పిల్లలు మేజర్లే కాగా, వాళ్ల చదువులు, ఆర్భాటాల కోసం తాహతుకు మించి చేసిన అప్పులు చేసి.. తీర్చలేకనే చనిపోతున్నట్లు ఇద్దరి ఇళ్లలో లభించిన సూసైడ్ నోట్లు దొరికాయి. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎడబాటు భరించలేక.. బదిలీ యత్నం ఫలించక.. సూసైడ్ నోట్ రాసి..
నగరి(చిత్తూరు జిల్లా): మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇక్కట్లతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరి పట్టణంలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఆనం లలితా లేఅవుట్లో నివసిస్తున్న గౌరీ యూనియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది. భర్త శివనాగభాస్కర్ రెడ్డితో కలిసి ఇక్కడే ఉంటోంది. వీరిద్దరూ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఆమె డ్యూటీకి రాకపోవడంతో ఇంటి వద్ద చూసిరావాలని సిబ్బందిని పంపగా ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మేనేజర్ సమాచారం మేరకు డీఎస్పీ యశ్వంత్, సీఐ మద్దయ్య ఆచారి, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చదవండి: సర్ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి.. ఉద్యోగాల రీత్యా పెళ్లయిన ఆరు నెలల నుంచి కలిసి కాపురం చేయలేకపోతున్నామనే ఆవేదన, బదిలీకి ప్రయతి్నంచినా నాలుగేళ్లుగా సఫలీకృతం కాలేదనే బాధ, బిజీగా ఉంటే కష్టాలు మరచిపోవచ్చంటూ చిట్టీలు ప్రారంభిస్తే కోవిడ్ లాక్‌డౌన్‌తో రెట్టింపైన కష్టాలు.. బాకీలు తీర్చాలంటూ బకాయి పడ్డవారి బెదిరింపులు, బ్యాంకు రుణం మంజూరుచేసి రుణ విముక్తి కల్పించలేదంటూ బ్యాంకు అధికారులపై కోపం వెరసి దంపతులను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. కడప జిల్లా ఎర్రగుంట్లలో కూలీల కుటుంబంలో పుట్టిన గౌరీ(25) కష్టపడి చదివి బ్యాంకు ఉద్యోగం సాధించింది. ఆమెకు కడప జిల్లా వీరప్పనాయనిరెడ్డి పాళెంకు చెందిన శివనాగభాస్కర్ రెడ్డి(32)తో వివాహమై ఐదేళ్లయింది. ఇతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. వివాహమైన ఆరు నెలలకే గౌరీకి యూనియన్ బ్యాంక్(ఆంధ్రబ్యాంక్) నగరి బ్రాంచ్‌కు బదిలీ అయింది. ఇక్కడ ఉద్యోగంలో చేరి లలితా లేఅవుట్లో అద్దె ఇంట్లో ఉన్నారు. అప్పటి నుంచి భార్యా భర్తలు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉంటూ కాపురం నెట్టుకొచ్చారు. ఈ అంశం వారిద్దరినీ మానసికంగా ఆవేదనకు గురిచేసింది. నాలుగేళ్లుగా బదిలీ కోసం బ్యాంకు ఉన్నతాధి కారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇలా కాలం వెళ్లదీస్తున్న క్రమంలో కృత్తిక(4), కుసుమంత్ రెడ్డి(1) అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కృత్తిక స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోలేకపోతున్నామనే బాధ వారిని వేధించింది. అప్పుల ఊబిలో.. ఈ కష్టాలు మరిచిపోవాలంటే బిజీగా ఉండాలని తలచిన శివనాగభాస్కర్ రెడ్డి హైదరాబాద్‌లో చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. ఈ దశలో కోవిడ్ లాక్డౌన్ రావడంతో చిట్టీల నిర్వహణ అస్తవ్యస్తమై ఆర్థికపరమైన సమస్యల్లో కూరుకుపోయాడు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి వద్ద భూముల దస్తావేజులు ఉంచి రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆర్థిక బాధలు తట్టుకోలేక ఏడాది క్రితం నగరికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. చిట్టీల్లో బకాయి ఉండడంతో వారంతా అతన్ని వెతుక్కుంటూ నగరికి రావడం మొదలుపెట్టారు. బ్యాంకుకు వెళ్లి గౌరీని కూడా బెదిరించారు. బ్యాంకులో రుణం తీసుకుని ఆర్థిక ఇబ్బందుల ఊబి నుంచి బయటపడదామనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో జీవితంపై విరక్తి చెందారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పిల్లలను పది రోజుల క్రితమే కడప జిల్లా పర్వరాజపేటలోని మేనత్త ఇంటికి పంపించేశారు. చివరకు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరూ తనువు చాలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఉన్మాదిలా మారిన ఐటీ ఉద్యోగి.. భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి
సాక్షి, చెన్నై(తమిళనాడు): రెండేళ్లుగా చవి చూసిన కష్టాలతో ఓ ఐటీ ఉద్యోగి ఉన్మాది మారాడు. తన భార్యను క్రికెట్‌బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల్ని తల దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం చెన్నై పెరుంగుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెరుంగుడిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మణిగండన్(42) నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య ప్రియ(36), ధరన్(10), దహన్(01) అనే కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు ఓ ఐటీ సంస్థలో మణిగండన్ ఉద్యోగం చేసేవాడు. లగ్జరీ గానే కుటుంబ జీవనం సాగింది. అయితే, హఠాత్తుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటికే మణిగండన్ పరిమితం అయ్యాడు. కుటుంబ పోషణ∙కోసం కొన్ని ప్రైవేటు బ్యాంక్‌ల నుంచి, స్నేహితుల నుంచి రూ.లక్షల్లో అప్పు చేశాడు. ప్రస్తుతం అప్పులు భారంగా మారడంతో మణిగండన్ ఉన్మాది అయ్యాడు. ఆదివారం భార్య ప్రియను, బిడ్డలను చంపేశాడు. ఆ తర్వాత వంట గదిలో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట జీహెచ్‌కు తరలించారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య.. అసలు కారణాలు ఇవేనా?
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీలో అప్పుల బాధతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రకాంత్‌రావు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా భార్యాపిల్లలు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విదితమే.. అనేక సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రకాంత్‌రావు ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. చంద్రకాంత్‌రావు దుండిగల్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో 2004 – 08లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. చదవండి: కాపురానికి రానందని కాటికి.. అప్పు తీర్చడానికి మరిన్ని అప్పులు గతంలో పలు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. 3, 4 ఏళ్ల క్రితం అమెరికాకు పోయేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాని కోసం క్రెడిట్ కార్డులను వాడి సకాలంలో కట్టకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి మనోవేదనకు గురయ్యాడు. వాటిని తీర్చే క్రమంలో మరిన్ని అప్పులు చేయడం, సిబిల్ స్కోర్ దెబ్బతినడంతో మరింత ఆవేదనకు గురయ్యాడు. అదే సమయంలో రుణాలు తీసుకొని స్థానికంగా ఓ ఇంటిని నిర్మించాడు. కోవిడ్ కారణంగా అద్దెకు ఎవరూ రాకపోవడంతో ఆర్థికంగా మరింత దెబ్బతిన్నాడు. అతడి భార్య తండ్రి సైతం ఆర్థిక సహాయాన్ని అందించాడు. సమస్యలు చుట్టుముట్టడంతో చంద్రకాంత్‌రావు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నాలుగు నెలల క్రితం ఈ సమస్యలు ఎక్కువగా ఉండేవని, అప్పుడున్నంత ఒత్తిడి ఇప్పుడు లేదని, భార్యాపిల్లలతో చంద్రకాంతరావు ఎంతో ఆనందంగా ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అతడికి లేదని, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని, ఆపదలో ఉన్నప్పుడు తోచిన సహాయం చేశామని అంటున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఏం జరిగిందో తెలియదని, తన గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన లావణ్య, పిల్లలు జోగిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి వీరి మృతదేహాలను విద్యుత్‌నగర్ కాలనీకి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలను రామచంద్రాపురంలోని శ్మశానవాటికలో నిర్వహించారు. కాగా శనివారం రాత్రి మృతురాలు లావణ్య తండ్రి పోలీసులకు తన కూతురి మరణానికి అత్తామామలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇలా ఏ కుటుంబంలో జరగవద్దు: చంద్రకాంతరావు స్నేహితుడు చంద్రకాంతరావు అందరితో స్నేహంగా ఉండేవాడు. నాలుగైదు నెలల క్రితం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డాడు. స్నేహితులం సహాయ సహకారాలు అందించాం. ఈ మధ్యకాలంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కూడా చెప్పాడు. చెప్పిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం బాధాకరం. ఇలా చేసుకునే ముందు భార్యాపిల్లలు, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండు. -
'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెల్పీ వీడియో తీసుకొని ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బాకీలోల్లు తనపై చేస్తున్న ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సదరు వ్యక్తి వీడియోలో స్పష్టం చేశాడు. ''నన్ను అప్పులోల్లు బాగా వేధిస్తున్నారు. దీనికి తోడు బ్యాంకు నుంచి కూడా ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. కనీసం భార్యపిల్లలున్నారనే అనే ఆలోచన లేకుండా నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మృతి చెందిన వ్యక్తి ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కిరోసిన్ పోసుకుని దంపతుల ఆత్మహత్య
-
కాటేసిన అప్పులు
-
మూకుమ్మడిగా విషం తాగిన కుటుంబం
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వారిని సొంతూరి నుంచి గరివిడికి తరిమాయి. అక్కడి నుంచి సింహాచలానికి తరిమికొట్టి ఉసురు తీసుకునేలా చేశాయి. విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన సింహాద్రి ఈశ్వరరావు, తన భార్యాకుమార్తెలతో కలిసి రెండున్నరేళ్ల క్రితం బతుకు తెరువు కోసం గరివిడి మండలం కొండపాలెం వచ్చాడు. అక్కడా పూట గడవని స్థితిలో సింహాచలం వచ్చి శనివారం రాత్రి కుటుంబమంతా విషం తాగి బలవన్మరణానికి ఒడిగట్టారు. వీరిలో తండ్రి, కూతురు మరణించగా.. తల్లి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. సాక్షి, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : ఓ చిన్ని కుటుంబాన్ని అప్పులు కాటేశాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ఇంటి పెద్దతోపాటు భార్య, కుమార్తె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో తండ్రీ కుమార్తె చనిపోయారు. తల్లి ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. హృదయవిదారకరమైన ఈ ఘటన సింహాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా, గరివిడి మండలం, కొండపాలెం గ్రామం అటుకా కాలనీకి చెందిన దంపతులు సింహాద్రి ఈశ్వరరావు(46), చంద్రకళ(39), తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె చాందిని (13) శనివారం సింహగిరిపై వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు దిగారు. కొంత సమయం గడిచిన తరువాత సాయంత్రం కూల్‌డ్రింక్‌లో తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు కలుపుకుని తాగారు. అయితే తండ్రీ, కుమార్తె పూర్తిగా తాగేయగా చంద్రకళ దుర్వాసన భరించలేక విడిచిపెట్టేసింది. కొద్దిసేపటికి స్పృహతప్పి పడి ఉన్న వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం సీఐ రమణయ్య వెంటనే ఆ కుటుంబ సభ్యులను 108లో కేజీహెచ్‌కు తరలించారు. మార్గమధ్యలో ఈశ్వరరావు, చాందిని మరణించారు. వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. చంద్రకళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె షాక్‌లో ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అప్పల బాధలు తాళలేక పురుగుల మందు తాగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఉపాధి కోసం వలస బాట గరివిడి(చీపురుపల్లి): బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన ఈశ్వరరావు నాలుగేళ్ల కిందట ఉపాధి కోసం గరివిడి మండలం తాటిగూడ గ్రామానికి వలసవచ్చాడు. అనంతరం రెండేళ్ల తర్వాత కొండపాలెం పంచాయితీ హడ్కోకాలనీకి వలస వచ్చేశాడు. అతనికి భార్య చంద్రకళ, కుమారుడు సాయికృష్ణ(20), కుమార్తె చాందిని ఉన్నారు. గతంలో తాటిగూడ గ్రామంలో రంగు రాళ్ల ఉంగరాలు తయారు చేసేవాడు. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంవతో కొండపాలెం పంచాయతీ హడ్కోకాలనీకి నివాసం మార్చుకున్నారు. బంగారం, వెండి వస్తువులు తయారు చేస్తూ కొండపాలెంలోని సూర్యసధనమ్ కోవెలలో పనిచేసేవాడు. కుమార్తె చాందిని స్థానిక హైస్కూల్లో 9వ తరగతి, కుమారుడు సాయికృష్ణ విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కుమార్తె, భార్యను తీసుకుని సింహాచలం వెళ్లిన ఈశ్వరరావు అక్కడ ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకునేంతగా అప్పులు ఏమున్నాయో తమకు తెలియని స్థానికులు చెబుతున్నారు. -
వరంగల్ : పెళ్లికి అప్పుచేసి.. ఆత్మహత్య
సాక్షి, వెంకటాపురం(ఎం): కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చే స్థోమత లేక మనస్తాపం చెంది అజ్మీర లక్ష్మి (40) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బావుసింగ్‌పల్లిలో సోమవారం జరిగింది. వెంకటాపురం ఎస్సై నరహరి కథనం ప్రకారం... బావుసింగ్‌పల్లికి చెందిన లక్ష్మికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. భర్త లక్ష్మణ్ పదేళ్ల క్రితమే మృతిచెందాడు. పెద్ద కూతురు రమ్య వివాహానికి అప్పు చేసింది. ఆ అప్పును తీర్చే స్థోమత లేక మనస్థాపం చెందిన లక్ష్మీ ఆదివారం రాత్రి ఇంటి వద్దనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు లక్ష్మిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెం దింది. మృతురాలి కూతురు రమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
అప్పులే యమపాశాలై..
ఆ దంపతులు బాగా బతకాలని కలలు కన్నారు. అప్పు తెచ్చి వ్యాపారం మొదలు పెట్టారు. శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా వారికి వ్యాపారం కలిసి రాలేదు. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోయింది. తీర్చే దారి లేకపోయింది. చావే శరణ్యమని భావించారు. పిల్లలకు విషం తాగించి.. వారూ తాగారు. భర్త మృతిచెందగా.. భార్య, ముగ్గురు పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన పలువురిని కలచివేసింది. కర్నూలు హాస్పిటల్/సి.క్యాంపు : దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మధు(30), లింగేశ్వరమ్మ(25) దంపతులు దాణా వ్యాపారంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి చిట్టెమ్మ(7), మౌనిక(5), వంశీ(3) సంతానం. ఎంతో అన్యోన్యంగా జీవించే వారి కుటుంబంలో ఇటీవల ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. దాణా వ్యాపారం కోసం రూ.25లక్షలు పెట్టి ఐదు బొలెరో వాహనాలు కొనుగోలు చేశారు. వ్యాపారంలో రోజుకు రూ.25వేలు ఆదాయం రావాల్సి ఉండగా రూ.3వేలు కూడా వచ్చేది కాదు. వస్తున్న ఆదాయానికీ చేస్తున్న ఖర్చుకు పొంతన లేకపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. ఏడాది నుంచి నష్టంతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరోవైపు తెచ్చుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోయింది. ఈ అప్పులకు సంబంధించి మూడు నెలల నుంచి భార్యాభర్తలు ఇంట్లో గొడవపడేవారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఆస్తి తగదాలు ప్రారంభమయ్యాయి. మధుకు ముగ్గురు సోదరులు. వీరికున్న మూడిళ్లను నలుగురూ పంచుకునే విషయంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంటికి గడియపెట్టుకుని ముందుగా పురుగుల మందును పిల్లలకు తాగించి, అనంతరం భార్యాభర్తలిద్దరూ తాగారు. చిన్నారి బిగ్గరగా ఏడవటంతో.. విషం తాగిన వెంటనే ఐదుగురూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికి చిన్నారి మౌనిక వాంతులు చేసుకుంటూ బిగ్గరగా ఏడ్వడంతో ఇరుగుపొరుగు వారు అనుమానించి తలుపులు బద్దలు కొట్టారు. పోలీసులకు, అంబులెన్స్‌కూ సమాచారం ఇచ్చి అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపు మధు మృతి చెందాడు. భార్య లింగేశ్వరమ్మతో పాటు చిట్టెమ్మ(లక్ష్మి) పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దు –ఏఎస్పీ షేక్షావలి జీవితంలో చిన్న చిన్న సమస్యలు సాధారణమని, ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని అడిషనల్ ఎస్పీ షేక్షావలి చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆయన కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషాతో కలిసి సందర్శించి, వారికి అందుతున్న వైద్యం, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పులు చేసే పరిస్థితికి ఎవ్వరూ రాకూడదని, ఆదాయానికి తగ్గట్లు జీవించాలని సూచించారు. కుటుంబం ఆత్మహత్యాయత్నానికి సంబంధించి విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కౌలు రైతు ఆత్మహత్య
కూసుమంచి : మండలంలోని గట్టుసింగారం గ్రామ కౌలు రైతు బొజ్జ లచ్చయ్య(50), బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు... ఇతడు తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమితోపాటు మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా పంటలు సాగు చేశాడు. పంటలు సరిగ్గా పండకపోవడం, అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనలకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో, తన ఇంట్లో బుధవారం పురుగు మందు తాగాడు. కుటంబీకులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడే మృతిచెందాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
పాల్వంచరూరల్ : పంట నష్టం, అప్పుల భారం భరించలేని ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు... పాల్వంచ మండలం ఉల్వనూరు పంచాయతీ గుండ్లమడుగు గ్రామానికి చెందిన కాలం బుచ్చిరాములు(39) సోమవారం రాత్రి పంట చేను వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు ఎకరం రూ.6500 చొప్పున ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. గత ఏడాది చేసిన అప్పులను ఈసారి తీర్చాలనుకున్నాడు. పత్తి సాగుకు సుమారు మూడులక్షల రూపాయలు అప్పు చేశాడు. పంట నష్టం, అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి భార్య మాధవి, కుమార్తెలు మౌనిక, మహాలక్ష్మి, అనంతిక ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు దూరమవడంతో ఆ భార్యాబిడ్డలు గుండెలవిసేలా రోదించారు. మృతుని సోదరుడు నర్సింహారావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పోస్టుమార్టం జరిగింది. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దస్తూరాబాద్(కడెం) : అప్పుల బాధతో దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ పంచాయతీ పరిధి చెన్నూర్‌కు చెందిన రైతు కొట్టె వేణు (32)మంగళవారం సాయంత్రం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోగా, ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడా పని దొరకక పోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకుని ఖరీఫ్‌లో వరి సాగు చేశాడు. దోమపోటుతో దిగుబడి తగ్గి మళ్లీ నష్టపోయాడు. రూ.5లక్షలు అప్పులుండడంతో తీర్చే మార్గంలేక మనస్తాపంతో మంగళవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, మెట్పల్లి: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని చౌలమద్దిలో జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం ప్రతాపరెడ్డి(30) తన వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
హసన్‌పర్తి: చేసిన అప్పులు తీర్చలేనని ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరి గణేష్‌రెడ్డి(40) కుటుంబ పోషణతోపాటు వ్యాపారం నిమిత్తం వివిధ వర్గాల నుంచి అప్పులు చేశాడు. అయితే సుమారు రూ.10 లక్షలు అప్పులు చేయగా వాటిని తీర్చలేనని మనోవేదనకు గురైన గణేష్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, పరకాల రూరల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వరికోల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోర్తాల తిరుపతి (39) తనకున్న ఎకరం భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడి ఎక్కువ కావడం, దిగుబడి తగ్గడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పటికే రూ.2 లక్షల అప్పు ఉండగా ఈ ఏడాది మరో రూ.లక్ష అప్పు చేశాడు. దీంతో అప్పు ఎలా తీర్చాలి అని మనోవేదనకు గురైన తిరుపతి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సమ్మక్క, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అప్పుల బాధతో నలుగురు రైతుల ఆత్మహత్య
సిద్దిపేట/చేవెళ్ల/తాండూరు/భూపాలపల్లి: అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం నారాయణరావుపేటకు చెందిన కనకయ్య (38) పంట సాగు, చెల్లెలు వివాహానికి రూ.2 లక్షలు అప్పు చేశాడు. పంటలు పండకపోవడంతో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అలాగే, రంగారెడ్డి జిల్లా కేసారాని చెందిన పెంటయ్య(30) అప్పుచేసి తన పొలంలో బోరువేసినా పడలేదు. దీంతో మనస్తాపం చెంది ఉరివేసుకున్నాడు. తాండూరు మండలంలోని జినుగుర్తికి చెందిన అనంతయ్య(45) కూడా కూతురి వివాహం కోసం చేసిన అప్పును తీర్చలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వరంగల్ జిల్లా భూపాలపలిల మండలం గుడాడ్పల్లికి చెందిన వ్యవసాయ కూలీ బోగి రవి(35) అప్పుల బాధ తాళలేక బుధవారం గ్రామసమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు.