అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిద్దిపేట/చేవెళ్ల/తాండూరు/భూపాలపల్లి: అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం నారాయణరావుపేటకు చెందిన కనకయ్య (38) పంట సాగు, చెల్లెలు వివాహానికి రూ.2 లక్షలు అప్పు చేశాడు. పంటలు పండకపోవడంతో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అలాగే, రంగారెడ్డి జిల్లా కేసారాని చెందిన పెంటయ్య(30) అప్పుచేసి తన పొలంలో బోరువేసినా పడలేదు. దీంతో మనస్తాపం చెంది ఉరివేసుకున్నాడు.
తాండూరు మండలంలోని జినుగుర్తికి చెందిన అనంతయ్య(45) కూడా కూతురి వివాహం కోసం చేసిన అప్పును తీర్చలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వరంగల్ జిల్లా భూపాలపలిల మండలం గుడాడ్‌పల్లికి చెందిన వ్యవసాయ కూలీ బోగి రవి(35) అప్పుల బాధ తాళలేక బుధవారం గ్రామసమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు.