
పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి మృతదేహం
సాక్షి, వెంకటాపురం(ఎం): కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చే స్థోమత లేక మనస్తాపం చెంది అజ్మీర లక్ష్మి (40) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బావుసింగ్‌పల్లిలో సోమవారం జరిగింది. వెంకటాపురం ఎస్సై నరహరి కథనం ప్రకారం... బావుసింగ్‌పల్లికి చెందిన లక్ష్మికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. భర్త లక్ష్మణ్ పదేళ్ల క్రితమే మృతిచెందాడు. పెద్ద కూతురు రమ్య వివాహానికి అప్పు చేసింది. ఆ అప్పును తీర్చే స్థోమత లేక మనస్థాపం చెందిన లక్ష్మీ ఆదివారం రాత్రి ఇంటి వద్దనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు లక్ష్మిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెం దింది. మృతురాలి కూతురు రమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment