
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెల్పీ వీడియో తీసుకొని ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బాకీలోల్లు తనపై చేస్తున్న ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సదరు వ్యక్తి వీడియోలో స్పష్టం చేశాడు.
''నన్ను అప్పులోల్లు బాగా వేధిస్తున్నారు. దీనికి తోడు బ్యాంకు నుంచి కూడా ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. కనీసం భార్యపిల్లలున్నారనే అనే ఆలోచన లేకుండా నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మృతి చెందిన వ్యక్తి ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment