
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. ‘సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ తుది శ్వాస విడిచిన నా తండ్రి పీవీ చలపతిరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ధన్యవాదాలు’ అని పీవీఎన్ మాధవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: (విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సమావేశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు)