PVN Madhav
-
పవన్ మాతో కలిసి రావడం లేదు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
అమరావతి: అవసరం అయితే బీజేపీకి బైబై చెప్పేందుకు కూడా సిద్ధమేనంటూ ఇప్పటికే తన వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పేశాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇది మరింత స్పష్టమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి పవన్ కల్యాణ్ దూరం జరగాడా అనే దానిపై ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. దీనికి బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఊతన్నిచ్చాయి. తమతో పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదని మాధవ్ సంచలన ఆరోపణలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్లే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించాలని కోరినా పవన్ స్పందించలేదని ఆయన స్పష్టం చేశారు. పైగా కమ్యూనిస్టులు తమకు సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, దాన్ని ఖండించాలని కోరినా పవన్ కల్యాణ్ ఖండించలేదన్నారు మాధవ్. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. ‘సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ తుది శ్వాస విడిచిన నా తండ్రి పీవీ చలపతిరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ధన్యవాదాలు’ అని పీవీఎన్ మాధవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: (విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సమావేశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) -
దుబ్బాకలో బీజేపీ విజయం అద్భుతం: మాధవ్
సాక్షి, విశాఖపట్నం: హోరాహోరిగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికలో చివరకు బీజేపీ విజయం సాధించింది. ఈ సందర్భంగా విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ అద్భుతమైన విజయం సాధించింది. అనంతరం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలను ఎన్నో విధాలుగా అధికార పార్టీ టీఆర్ఎస్ ఇబ్బందులకు గురిచేసిందిని, తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేదన్న వారికి దుబ్బాక ఫిలితమే ఒక నిదర్శనం అన్నారు. బీహార్‌లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, బీజీపీ విజయం సాధించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితిరే నిదర్శనం అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
'ఒంటరిగానే బలమైన శక్తిగా ఎదుగుతాం'
సాక్షి, విజయవాడ : మేము ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేమని, ఒంటరిగానే బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని, పోలవరం విషయంలో విచ్చల విడిగా అవినీతి జరిగిందని మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రే పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని అన్నారని విమర్శించారు. టీడీపీ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపిస్తే దానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక వైఎస్ జగన్ 100 రోజుల పాలనలో చిత్తశుద్ది కనిపిస్తుందని, నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలనకు సీఎం జగన్ పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 19 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు త్వరగతిన పూర్తి చేసేలా త్వరలోనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తామని మాధవ్ తెలిపారు. -
చిరంజీవి మమ్మల్ని సంప్రదించలేదు..
సాక్షి, అమరావతి : బీజేపీలో చేరే విషయమై మెగాస్టార్ చిరంజీవి తమతో సంప్రదింపులు జరపలేదని, జాతీయ స్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారేమో తెలియదని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 11తరువాత పార్టీలో కీలక మార్పులు, చేర్పులు ఉంటాయని వెల్లడించారు. టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నారు. తమ పదవులకి రాజీనామా చేసి బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి వస్తుందని, సామాజిక న్యాయం ఆధారంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అనేది ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతుందని, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడై రెండేళ్లు మాత్రమే అయ్యిందన్నారు. -
‘నారా, నందమూరి పార్టీగా టీడీపీ’
సాక్షి, విజయవాడ: ఈనెల 23 తరువాత రాష్ట్రంలో టీడీపీ రెండుగా చీలబోతుందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజమైన టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేయనున్నారని తెలిపారు. నారావారి పార్టీ, నందమూరి వారి పార్టీగా టీడీపీ చీలనుందన్నారు. రాష్ట్రంలో సైకిల్ టైరులో గాలిలేదని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో స్థానం లేదు కాబట్టే జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి చంద్రబాబే దోహద పడ్డారని, జనసేన పార్టీ చీల్చిన ఓట్లు టీడీపీవేనని ప్రజలు గమనించారన్నారు. ప్రజాశాంతి పార్టీ పేరుతో రాయలసీమలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ధోరణి దొంగే దొంగా అన్నట్టు ఉందని, డేటా చోరి కేసులో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబును ఎన్నికల సంఘం విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ, బీజేపీ కలిసిపోయాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొందని.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని మాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయొచ్చు కదా ?
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో అసహనం పెరిగిపోయిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడులో అసంతృప్తి పెరిగిపోయిందని, అందుకే బీజేపీ నేతలపై దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని ఆరోపించారు. పార్లమెంట్ లాబీలో ఆ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ స్పష్టమైన వైఖరిని అవలంభిస్తోందని, ఉక్కు పరిశ్రమ ఇస్తున్నారని తెలిసికూడా రాజకీయాలకు పాల్పడుతున్నారని మాధవ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఉద్యోగాల పేరుతో మంత్రలు కోట్లు దండుకుంటున్నారని, మంత్రుల ఇళ్లలోనే నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పదవులకు రాజీనామా చేయొచ్చు కదా! : తెలుగదేశం పార్టీ దీక్షలన్నీ రాజకీయం, మైలేజే కోసమేనని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. నాలుగేళ్లు పనులు చేయకుండా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు ఎందుకు దీక్ష చేస్తున్నారో ప్రజలకు తెలుసునని.. దీక్షలకు బదులు రాజీనామా చేసి పోరాడాలంటూ డిమాండ్ చేశారు. దొంగ దీక్షల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. -
చెప్పిందే చెప్పడంలో సీఎం దిట్ట..!
సాక్షి, విజయనగరం : బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తీతువు పిట్టలా అరుస్తూ, అబద్ధాలు చెబుతూ.. చెప్పిందే చెప్తూ రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏదో వెలగబెడుతున్నట్టు ప్రజల్ని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. పనికిరాని పర్యటనలతో ప్రజాధనం నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ‘తీతువు పిట్ట సముద్రం ఒడ్డున పడుకొని ఆకాశాన్ని కిందపడకుండా ఆపానని కలలు కంటుందట. చంద్రబాబు తీరు అలానే ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజీపీని అడ్డుకుంటానంటున్న ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం’ అని వ్యాఖ్యానించారు. బాబు రాజకీయాలను ఆ పార్టీ నాయకులే సహించలేక పోతున్నారని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా బలపడదామనుకునే ఆయన కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ రూపేణా రావాల్సిన 16,500 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ, మోదీ సర్కారును బద్నాం చేయడానికి చంద్రబాబు ఆ నిధులను తీసుకోవడం లేదని ఆరోపించారు. -
చంద్రబాబుది వాడుకొని వదిలేసే తత్వం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అవసరం ఉన్నప్పుడు వాడుకొని, అవసరం లేనప్పుడు వదిలేసే తత్వం చంద్రబాబునాయుడిదని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ విమర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి వస్తున్న ఆదరణ చూడలేక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేందుకు చంద్రబాబు ఎత్తుగడ వేశారన్నారు. బీజేపీని రాజకీయ క్రీడలో భాగంగా వాడుకున్నారన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొన్నట్టు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో ఉంటారన్నారు. పొత్తులతో సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అవినీతి రహితపాలన అందిస్తున్న నరేంద్రమోదీకి అన్ని రాష్ట్రాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీ విజయం సాధించిందన్నారు. రాష్ట్రంలో కార్యకర్తల బలం ఉందని, బలం నిరూపించుకొనేలా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తొలుత స్థానిక గాంధీనగర్ మున్సిపల్ పార్కులో స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగుతున్న పనులు పరిశీలించారు. కేంద్రం కాకినాడ స్మార్ట్‌సిటీ అభివృద్ధికి నిధులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. రెండేళ్ల క్రితం కేంద్రం కాకినాడకు రూ.400 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ.250 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే ప్రారంభించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు పర్సంటేజీల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని వాపోయారు. సమావేశంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పైడా కృష్ణమోహన్, జిల్లా అధ్యక్షుడు వై మాలకొండయ్య, కార్పొరేటర్లు సాలగ్రామ లక్ష్మీప్రసన్న, నల్లబిల్లి సుజాత, గోడి సత్యవతి పాల్గొన్నారు. -
మాధవ్ వర్సెస్ వరప్రసాద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యేక హోదా అంశంపై ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బుధవారం శాసనమండలిలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటే, ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. టీడీపీ తప్పుడు రాతలు: ఎమ్మెల్సీ మాధవ్ ‘టీడీపీ మాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటున్నారు ఎప్పుడు ఇవ్వలేదో చెప్పమనండి. ఎయిమ్స్ పనిజరగడం లేదని టీడీపీ అధికార వెబ్సైట్లో తప్పుడు రాతలు రాస్తున్నారు. మంగళగిరి వెళ్లి పనులు పరిశీలించి మాట్లాడండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి బాకీ లేదు, బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. 2019 ఎన్నికల కోసం హడావుడిగా స్పిల్‌వే పనులు చేపట్టారు. నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. మేము అన్నీ నిజాలే చెబుతామ’ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఏపీపై కేంద్రం పోలీసింగ్: ఎమ్మెల్సీ డొక్కా ‘రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. ఇది రాజకీయ ధర్మమా, మిత్ర ధర్మమా? ఏపీ ప్రభుత్వం అడిగిన ప్రతివిషయాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. అహ్మదాబాద్, ముంబై మెట్రోకు వేల కోట్లు కేటాయిస్తారు. అమరావతి మెట్రోకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పోలీసింగ్ చేస్తోంది. అభివృద్ధి ఎలా చేయాలో చంద్రబాబు నుంచి కేంద్రం నేర్చుకోవాలి. పార్లమెంటు చట్టాలంటే బీజేపీకి గౌరవం లేదు. ఐదుకోట్ల ఏపీ ప్రజలను నిర్లక్ష్యం చేయొద్దు. కేంద్రంపై పోరాటం చేసేవరకూ తెచ్చుకోవద్ద’ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.