
సాక్షి, అమరావతి : బీజేపీలో చేరే విషయమై మెగాస్టార్ చిరంజీవి తమతో సంప్రదింపులు జరపలేదని, జాతీయ స్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారేమో తెలియదని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 11తరువాత పార్టీలో కీలక మార్పులు, చేర్పులు ఉంటాయని వెల్లడించారు. టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నారు. తమ పదవులకి రాజీనామా చేసి బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి వస్తుందని, సామాజిక న్యాయం ఆధారంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అనేది ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతుందని, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడై రెండేళ్లు మాత్రమే అయ్యిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment