
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ఒక స్థానం ఉండేలా చూడాలని సినీ ప్రముఖులు కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్ చెప్పారని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి అందర్నీ సమన్వయం చేశారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని గుర్తుచేశారు. సినీ పరిశ్రమ ప్రముఖులు అందురూ కూడా ప్రతి సమస్యను సీఎం వైఎస్ జగన్‌తో చర్చించారని పేర్కొన్నారు.
హీరో చిరంజీవి.. సినీ పరిశ్రమ సమస్యలన్నీ సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. సుమారు గంటకు పైగా జరిగిన సమావేశంలో.. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment