AP Movie Ticket Rates: AP CM YS Jagan Meeting With Chiranjeevi - Sakshi
Sakshi News home page

CM Jagan-Chiranjeevi: పండగపూట ఆనందకర భేటీ జరిగింది: చిరంజీవి

Published Thu, Jan 13 2022 8:43 AM | Last Updated on Thu, Jan 13 2022 4:03 PM

Chiranjeevi Meeting With CM YS Jagan Over Cinema Ticket Rates Highlights - Sakshi

3.10 PM
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం ఆనందంగా ఉందన్నారు. 

 2.30 PM
 సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగింది. సినీపరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ హీరో మెగాస్టార్‌ చిరంజీవి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మెగాస్టార్‌ చిరంజీవి తాడేపల్లికి బయల్దేరారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కాసేపట్లో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించాలని తెలిపారు. ఇండస్ట్రీ తరపున సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వచ్చానని పేర్కొన్నారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతానని చిరంజీవి చెప్పారు.

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రముఖ హీరో మెగాస్టార్‌ చిరంజీవి  గురువారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలవనున్నారు. వీరిద్దరి మధ్య ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వక లంచ్‌ భేటీ జరగనుంది. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చదవండి:  Tammareddy Bharadwaj: ఏపీ ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement