
సాక్షి, విశాఖపట్నం: హోరాహోరిగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికలో చివరకు బీజేపీ విజయం సాధించింది. ఈ సందర్భంగా విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ అద్భుతమైన విజయం సాధించింది. అనంతరం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలను ఎన్నో విధాలుగా అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఇబ్బందులకు గురిచేసిందిని, తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్‌ఎస్ అడ్డదారులు తొక్కిందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేదన్న వారికి దుబ్బాక ఫిలితమే ఒక నిదర్శనం అన్నారు. బీహార్‌లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, బీజీపీ విజయం సాధించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితిరే నిదర్శనం అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment