శ్రుతీహాసన్
‘‘నేను చిన్నప్పుడు మానసిక ఆందోళనతో బాధపడ్డాను. మానసిక ఆరోగ్యంపై మన దేశంలో ఓ దురభిప్రాయం ఉంది. అందుకే చాలామంది బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా బాధపడుతున్నారు’’ అన్నారు శ్రుతీహాసన్. మానసిక ఆరోగ్యం, దాని చుట్టూ ఉన్న అపోహల గురించి శ్రుతీ ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ – ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఆందోళనకు గురయ్యేదాన్ని. హీరోయిన్‌గా సక్సెస్ అయిన తర్వాత కూడా బయటకు కనిపించడానికి కొంచెం ఆందోళన పడేదాన్ని. బయటకు రావడానికి చాలా సమయం తీసుకునేదాన్ని.
దీంతో చాలామంది ‘శ్రుతీ సినిమాలు మానేస్తోంది, పెళ్లి చేసుకుంటోంది, ఏదో ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది’ అంటూ రకరకాల పుకార్లు పుట్టించారు. కొన్ని విని నవ్వుకునేదాన్ని. మన దేశం అద్భుతమైనది, ఉత్సాహపూరితమైనది. అయినప్పటికీ డిప్రెషన్స్ ఎక్కువ గురవుతున్న దేశాల్లో మనం కూడా ఉన్నాం. మూడు సెకన్లకు ఒకరు ఆత్మాహత్యా యత్నం చేస్తున్నారు. నా మానసిక సమస్యలను బయటకు చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు పడ్డాను, వీక్‌గా ఫీల్ అయ్యాను. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలంటే బయటకు మాట్లాడాలి. పరిష్కరించుకోవాలి. ఒత్తిడి నుంచి విముక్తి పొందాలి’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment