సైకాలజికల్‌ సమస్యలతో బాధపడుతున్న స్టార్‌ హీరోయిన్‌! | Shruti Haasan Reveals She Suffer With Psychological Problems | Sakshi
Sakshi News home page

Shruti Haasan: సైకాలజికల్‌ సమస్యలతో బాధపడుతున్న స్టార్‌ హీరోయిన్‌!

Published Thu, Jan 12 2023 1:52 PM | Last Updated on Fri, Jan 13 2023 12:33 PM

Shruti Haasan Reveals She Suffer With Psychological Problems - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్‌ ఒకరు. తరచూ వార్తల్లో ఉండే నటి కూడా ఆమె. ముఖ్యంగా బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తనకున్న సైకాలజికల్‌ ప్రాబ్లమ్స్‌ను బయటపెట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కింది శృతి. రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ​తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ‘నాకు మానసికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి.

చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన ఉపాసన, ట్వీట్‌ వైరల్‌

ఉన్నట్టుండి ఎక్కువగా ఉద్రేకపడతాను. కొన్ని విషయాల్లో సహనాన్ని కోల్పోయి ఆవేశపడతాను. నా సమస్యల గురించి బయటకు చెప్పడానికి మొదట భయపడ్డాను. ఈ మధ్య చాలా మంది తమ సమస్యలను బయటకు చెప్పేస్తున్నారు. దీంతో నాకూ కూడా నా మానసిక రుగ్మతల గురించి చెప్పాలి అనిపింది’ అని చెప్పింది. ‘అయితే ప్రస్తుతం నా మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్నాను. మానసిక రుగ్మతలను తగ్గించడానికి సంగీతం కూడా ఉపయోగపడుతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే అది షూటింగ్‌ స్పాట్‌లో అయిన, ఇంట్లో అయిన వెంటనే కోపం వస్తుంది.

చదవండి: అర్జున్‌ రెడ్డి ఆఫర్‌ వదులుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశా: హీరోయిన్‌

అలాంటి పరిస్థితి తీవ్రం అయితే వెంటనే థెరపీ చికిత్సకు వెళుతున్నాను. నా సమస్యలను నేను దాచాలనుకోవడం లేదు’ అని పేర్కొంది. అయితే మన సమస్యలను నిర్మోహమాటంగా బయటకు చెప్పేయాలన్నారు. దాచాలనుకుంటే ఆ సమస్యలు మరింత అధికం అవుతాయని, ఎవరేమనుకుంటారో అని భయపడుతుంటారంది. కానీ మన సమస్యల గురించి బయటకు చెప్పితే భారం తగ్గడమే కాదు సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుందని శృతి చెప్పుకొచ్చింది. కాబట్టి సమస్య ఎలాంటిదైనా మనసు విప్పి చెప్పుకోండి అంటూ ఆమె సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement