శృతి వీడియో.. ఇరకాటంలో కమల్‌ హాసన్‌ | Twitterati Trolls Kamal Haasan For Stand Against Caste After His Daughter Shruti Hassan Iyengar Comment Video Goes Viral | Sakshi
Sakshi News home page

శృతి వీడియో.. ఇరకాటంలో కమల్‌ హాసన్‌

Published Mon, Jul 2 2018 4:20 PM | Last Updated on Mon, Jul 2 2018 4:50 PM

Twitterati Trolls Kamal Haasan For Stand Against Caste After His Daughter Shruti Hassan Iyengar Comment Video Goes Viral - Sakshi

కూతురు శృతి హాసన్‌తో కమల్‌ హాసన్‌

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌కు ట్విటర్‌లో చేదు అనుభవం ఎదురైంది. కుల వ్యవస్థ గురించి కమల్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ట్రోల్‌ చేస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల అభిమానులతో ట్విటర్‌లో జరిగిన సంభాషణలో కుల వ్యవస్థపై మీ అభిప్రాయమేమిటని ఓ అభిమాని కమల్‌ను ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘నా ఇద్దరు కూతుళ్లను స్కూళ్లో చేర్పించే సమయంలో కులం, మతం వంటి కాలమ్స్‌ నింపమని అడిగినపుడు నేను వ్యతిరేకించాను. ఇటువంటి దృక్పథమే నా కుటుంబంలోని భవిష్యత్‌ తరాలకు అలవడుతుంది. ప్రతీ ఒక్కరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత కుల వ్యవస్థ అనేది క్రమంగా నశించిపోతుంది. కేరళ కూడా ఇలాంటి పద్ధతినే అవలంబిస్తోంది’ అంటూ కమల్‌ ట్వీట్‌ చేశారు.

అయితే ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్‌... కమల్‌ పెద్ద కూతురు, ప్రముఖ హీరోయిన్‌ శృతీ హాసన్‌ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాలూకు వీడియో క్లిప్‌ పోస్ట్‌ చేశారు. ఆ ఇంటర్వ్యూలో తాను ‘అయ్యంగార్‌’  సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా శృతి చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో కమల్‌ను ట్రోల్‌ చేస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు.

‘కేవలం స్కూలు అప్లికేషన్‌లో కులానికి సంబంధించిన కాలమ్‌ నింపకపోవడం వల్ల కుల వ్యవస్థ నశిస్తుందన్న మీ అభిప్రాయం తప్పు సార్‌. సమాజాన్ని సంస్కరించే కార్యక్రమం మీ ఇంటి నుంచే ప్రారంభించండి. పిల్లల ముందు కుల ప్రస్తావన తీయకుండా, వారు ఏ కులానికి చెందిన వారో తెలియకుండా పెంచితేనైనా మీరు కోరుకునే మార్పు వచ్చే అవకాశం ఉందంటూ’ ఓ నెటిజన్‌ ఘాటుగా విమర్శించాడు. ‘మీరు కులానికి సంబంధించిన కాలమ్‌ నింపలేదేమో గానీ మీ సామాజిక గుర్తింపు ఏమిటో మీ కూతురి మాటల ద్వారా బహిరంగంగానే తెలియజేశారు కదా’ అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement