హీరోయిన్‌ అయిన తర్వాతే... | I am trying to make a single status mantiine Shruti Haasan | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ అయిన తర్వాతే...

Published Sun, Jun 4 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

హీరోయిన్‌ అయిన తర్వాతే...

హీరోయిన్‌ అయిన తర్వాతే...

నా పర్సనల్‌ లైఫ్‌లోకి పబ్లిగ్గా చాలా మంది తొంగి చూడడం మొదలైందంటున్నారు శ్రుతీ హాసన్‌. ఫిల్మ్‌ స్టార్స్‌ లైఫ్‌లో ఇదంతా కామన్‌! ఈ సంగతి శ్రుతీకి తెలుసు. కానీ, కొందరు హద్దుమీరి ప్రవర్తించారట. వాళ్ల గురించి శ్రుతీ హాసన్‌ మాట్లాడుతూ – ‘‘నా పర్సనల్‌ లైఫ్‌ గురించి కొన్ని సందర్భాల్లో కొందరు పిచ్చి కూతలు కూసినప్పుడు అసౌకర్యంగా ఫీలయ్యా. చాలా బాధపడ్డా. కానీ, తప్పదు. స్టార్స్‌ లైఫ్‌లో, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇంతే’’ అన్నారు.

శ్రుతి అంత అసౌకర్యంగా ఫీలైన సందర్భం ఏంటబ్బా? అని ఆలోచిస్తే... రీసెంట్‌ టైమ్స్‌లో లండన్‌ బేస్డ్‌ ఇటాలియన్‌ యాక్టర్‌తో శ్రుతి ప్రేమలో ఉందనే పుకారు బాగా షికారు చేసింది. అది నిజమా? కాదా? అని శ్రుతీ హాసన్‌ను అడిగితే... ‘‘నా పర్సనల్‌ లైఫ్‌ గురించి నేను కామెంట్‌ చేయను. ఎందుకంటే... నేను సింగిల్‌ స్టేటస్‌ మేంటైన్‌ చేయాలని ప్రయత్నిస్తున్నా. నా లైఫ్‌లో చాలా ముఖ్యమైన విషయం గనుక... లవ్‌లో పడ్డానా? లేదా? అనే మేటర్‌ను సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నా. అమ్మానాన్న దగ్గర మాత్రం అన్నీ ఓపెన్‌గా చెప్పేస్తా. వాళ్లకు అన్నీ తెలుసు’’ అని సెలవిచ్చారు. ఈ మాటలను బట్టి శ్రుతి లవ్‌లో పడ్డారని అనుకోవాలా! లేదనుకోవాలా!! ఈసారి కమల్‌హాసన్‌ను కలసినప్పుడు అడగాలి. నాన్న దగ్గర ఓపెన్‌గా అన్నీ చెబుతానని శ్రుతి చెప్పారు కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement