Italian Actor
-
వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మృతి
ప్రపంచంలోనే అందమైన నటిగా పేరుగాంచిన తార ఇకలేరు. ఇటాలియన్ వెండితెర రాణిగా వెలుగొందిన జినా లొల్లో బ్రిగిడా(95) ఇవాళ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఇటాలియన్ వార్తా సంస్థ అన్సా ధృవీకరించింది. దీంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. హాలీవుడ్లో 'బ్రెడ్, లవ్ అండ్ ఫాంటసీ' సినిమాలో తన పాత్రకు బాగా ప్రసిద్ది చెందింది. 1950వ దశకంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్‌గా పేరు సంపాదించింది. ఫ్రాంక్ సినాట్రా, హంఫ్రీ బోగార్ట్, మార్సెల్లో మాస్ట్రోయాని లాంటి నటులతో 60కి పైగా చిత్రాలలో నటించింది. 1960 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో కెరీర్ నెమ్మదించింది. జినా ఇటలీలోని సుబియాకోలోని సంపన్న కుటుంబంలో 1927లో జన్మించింది. చదువు కోసం 20 సంవత్సరాల వయస్సులో రోమ్‌కి వెళ్లింది. ఆమె సినిమాల్లో నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది. -
హీరోయిన్ అయిన తర్వాతే...
నా పర్సనల్ లైఫ్‌లోకి పబ్లిగ్గా చాలా మంది తొంగి చూడడం మొదలైందంటున్నారు శ్రుతీ హాసన్. ఫిల్మ్ స్టార్స్ లైఫ్‌లో ఇదంతా కామన్! ఈ సంగతి శ్రుతీకి తెలుసు. కానీ, కొందరు హద్దుమీరి ప్రవర్తించారట. వాళ్ల గురించి శ్రుతీ హాసన్ మాట్లాడుతూ – ‘‘నా పర్సనల్ లైఫ్ గురించి కొన్ని సందర్భాల్లో కొందరు పిచ్చి కూతలు కూసినప్పుడు అసౌకర్యంగా ఫీలయ్యా. చాలా బాధపడ్డా. కానీ, తప్పదు. స్టార్స్ లైఫ్‌లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతే’’ అన్నారు. శ్రుతి అంత అసౌకర్యంగా ఫీలైన సందర్భం ఏంటబ్బా? అని ఆలోచిస్తే... రీసెంట్ టైమ్స్‌లో లండన్ బేస్డ్ ఇటాలియన్ యాక్టర్‌తో శ్రుతి ప్రేమలో ఉందనే పుకారు బాగా షికారు చేసింది. అది నిజమా? కాదా? అని శ్రుతీ హాసన్‌ను అడిగితే... ‘‘నా పర్సనల్ లైఫ్ గురించి నేను కామెంట్ చేయను. ఎందుకంటే... నేను సింగిల్ స్టేటస్ మేంటైన్ చేయాలని ప్రయత్నిస్తున్నా. నా లైఫ్‌లో చాలా ముఖ్యమైన విషయం గనుక... లవ్‌లో పడ్డానా? లేదా? అనే మేటర్‌ను సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నా. అమ్మానాన్న దగ్గర మాత్రం అన్నీ ఓపెన్‌గా చెప్పేస్తా. వాళ్లకు అన్నీ తెలుసు’’ అని సెలవిచ్చారు. ఈ మాటలను బట్టి శ్రుతి లవ్‌లో పడ్డారని అనుకోవాలా! లేదనుకోవాలా!! ఈసారి కమల్‌హాసన్‌ను కలసినప్పుడు అడగాలి. నాన్న దగ్గర ఓపెన్‌గా అన్నీ చెబుతానని శ్రుతి చెప్పారు కదా!