'అమ్మా నాన్న ఆట' ఆగిపోయింది | kamal haasan, amala, amma nanna aata stopped | Sakshi
Sakshi News home page

'అమ్మా నాన్న ఆట' ఆగిపోయింది

Published Thu, Feb 4 2016 1:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

'అమ్మా నాన్న ఆట' ఆగిపోయింది

'అమ్మా నాన్న ఆట' ఆగిపోయింది

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'అమ్మా నాన్న ఆట' సినిమా ఆగిపోయింది. ఉత్తమ విలన్, చీకటి రాజ్యం లాంటి సినిమాల తరువాత సూపర్ ఫాంలో కనిపించిన కమల్, అదే స్పీడులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అమల హీరోయిన్గా అమ్మా నాన్న ఆట అనే సినిమాను ప్రారంభించిన కమల్, తాజాగా ఆ సినిమా ఆగిపోయినట్టుగా ప్రకటించాడు. అయితే ఎందుకు ఆగిపోయింది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

టికె రాజీవ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోవటంతో ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమాను స్టార్ చేస్తున్నాడు. కొత్త సినిమాలో రమ్యకృష్ణ, కమల్కు జోడిగా నటిస్తుండగా కమల్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కమల్ కూతురి పాత్రలో కనిపించనుంది. ఓ టీవి ఛానల్ ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించిన కమల్ హాసన్ త్వరలోనే నెక్ట్స్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement