
గెలుపుగుర్రంగా డీ-డే
శ్రుతీహాసన్ బాలీవుడ్‌లో నటించిన ‘డి-డే’ చిత్రం ‘గెలుపుగుర్రం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. అర్జున్ రామ్‌పాల్, ఇర్ఫాన్‌ఖాన్, అనిల్ కపూర్, రిషికపూర్, నాజర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చితానికి నిఖిల్ అద్వాని దర్శకుడు. సురేశ్ దూడల ఈ అనువాద చిత్రానికి నిర్మాత. అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇందులో శ్రుతీ హాసన్ వేశ్యగా నటించారు. పాత్రోచితంగా ఆమె నటించిన హాట్ సన్నివేశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే... దర్శకుడు వాటిని కళాత్మకంగానే తీశాడు కానీ, ఎక్కడా వల్గారిటీ కనిపించదు. శంకర్-ఎహసాన్-లాయ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: సి.ఆర్.రాజన్.