NBK107: తండ్రికొడుకులుగా కనిపించనున్న బాలయ్య! | Balakrishna Plays Double Role As Father And Son In Gopichand Malineni Movie | Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: NBK107: తండ్రికొడుకులుగా కనిపించనున్న బాలయ్య!

Published Fri, Feb 25 2022 8:28 PM | Last Updated on Fri, Feb 25 2022 8:31 PM

Balakrishna Plays Double Role As Father And Son In Gopichand Malineni Movie - Sakshi

Balakrishna-Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్‌ డైరెక్షన్‌లో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నిన్న(ఫిబ్రవరి 18) మొదలైంది. 'సిరిసిల్ల' జిల్లాలో మొదటి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలయ్య ద్వీపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: త్వరలో పెళ్లి పీటలెక్కబోతోన్న మరో బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌!

అక్కడి నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. ప్రతినాయకుడిగా కన్నడ హీరో దునియా విజయ్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం 'వీరసింహా రెడ్డి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement