![కొలవ‘రెడీ’!](/styles/webp/s3/article_images/2017/09/2/61412622686_625x300.jpg.webp?itok=y0h1gokk)
కొలవ‘రెడీ’!
అట్టర్ ఫ్లాప్‌లతో సొంతింట అడ్రస్ గల్లంతై దిగాలుపడ్డ శృతిహాసన్‌కు కాస్తింత కిక్ ఇచ్చాడు హీరో విశాల్. తాను చేయబోయే ‘పూజై’ సినిమాలో హీరోయిన్‌గా శృతిని తీసుకున్నాడు. దీనికి ఉబ్బితబ్బిబ్బయిన ఈ స్వీటీ... ఇంత లాంగ్ గ్యాప్ తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఇచ్చిన విశాల్‌కు థ్యాంక్స్ చెప్పింది. 2012లో చేసిన ‘3, 7 ఏఎం అరివు’ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. దీంతో అమ్మడికి అవకాశాలు నిల్ అయ్యాయి. ‘మళ్లీ తమిళ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన విశాల్‌కు ధన్యవాదాలు’ అంటూ చెప్పిందీ కొలవెరీ భామ.