Salaar Latest Update: KGF Actress Srinidhi Shetty Special Song In Prabhas Movie - Sakshi
Sakshi News home page

కన్నడ భామతో ప్రభాస్‌ స్పెషల్‌ సాంగ్

Published Tue, May 4 2021 4:03 PM | Last Updated on Tue, May 4 2021 9:24 PM

KGF Fame Srinidhi Shetty Have A Special Dance With Prabhas In Salaar - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వరుసగా భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ కూడా ఒకటి. ఈ పాన్‌ ఇండియా సినిమాలో తొలిసారిగా ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేసింది చిత్ర బృందం. అయితే ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. సలార్‌ సినిమాలో ప్రభాస్‌తో స్పెప్పులేసేందుకు కేజీఎఫ్‌ భామ శ్రీనిధీ శెట్టిని రంగంలోకి దింపుతున్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. 

ఈ భామతో ఓ స్పెషల్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేసింది చిత్ర బృందం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సలార్‌లో ఈ స్పెషల్‌ సాంగ్‌ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం.  నెక్స్ట్ షెడ్యూల్‌లోనే ఈ కన్నడ భామతో ప్రభాస్‌ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ ఉండనుందట. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. అతి  త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ను మొదట పెట్టనున్నారని సమాచారం. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

చదవండి : ప్రభాస్‌ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్‌
'ప్రభాస్‌ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement