
విశాల్‌కూ హ్యాండిచ్చిన శృతి
నటి శృతి హాసన్ కోలీవుడ్‌ను పక్కన పెడుతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తెలుగు, హిందీ చిత్రాలపై అధిక శ్రద్ధ చూపుతున్న ఈ భామ త్వరలో తమిళ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అది కాస్త ఎండమావిగానే మారింది. ఇంతకు ముందు ఆర్యతో శృతి జతకట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ చిత్రాన్ని శృతి కాదనేశారు. ఆ తరువాత విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని కూడా శృతి నిరాకరించడం టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది.
ఆర్య హీరోగా మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో మిగామాన్ చిత్రంలో శృతి నటించాల్సి ఉంది. అయితే హిందీలో రెండు చిత్రాలు, తెలుగులో రెండు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆర్య చిత్రానికి కాల్‌షీట్స్ కేటాయించలేనని చెప్పేశారు. ఆ తర్వాత ఆర్య స్నేహితుడు విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కనున్న నూతన చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ అన్నారు. అయితే ఆమె కాల్‌షీట్స్ అడిగిన ఈ చిత్ర దర్శక నిర్మాతలకు సరైన సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ వచ్చిన శృతిహాసన్ చివరికి ఆర్యకు చెప్పిన సమాధానమే చెప్పి చల్లగా జారుకున్నారట.