Vijay Sethupathis Released Laabam Movie Trailer - Sakshi
Sakshi News home page

'లాభం' ట్రైలర్‌ విడుదల చేసిన సేతుపతి

Sep 4 2021 9:19 PM | Updated on Sep 20 2021 11:54 AM

Vijay Sethupathis Laabam Trailer Is Out - Sakshi

విజయ్‌ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం లాభం. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లాయ‌ర్ శ్రీరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. తాజాగా విజయ్‌ సేతుపతి ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ... "ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సినిమాను నా సొంత బ్యానర్ లో నిర్మించాను. కథ చాలా యూనిక్ గా ఉండి... ఓ మెసేజ్ ఇచ్చేలా సినిమాను తీశాము. రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్య... వ్యవసాయ భూముల పైనా... పంటల పైనా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం... ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైనా చాలా కూలంకషంగా ఇందులో చూపించడం జరిగింది.

ట్రైలర్ లో కూడా అదే చూపించాము. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు నా అభినందనలు" అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను అన్ని కమ‌ర్షియ‌ల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌టం హ్యాపీగా ఉంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement