కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న నటుడు విజయ్ సేతుపతి. పిజ్జా వంటి సినిమాలతో హీరోగానే కాకుండా.. దళపతి విజయ్ హీరోగా చేసిన ‘మాస్టర్’లో విలన్‌గా చేసి తెలుగులో మంచి గుర్తింపు సాధించాడు. అనంతరం మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథనాయకుడిగా చేసిన ‘ఉప్పెన’ సినిమాతో మక్కల్ సెల్వన్ ఈమెజ్ ఇంకా పెరిగింది.
అయితే ఈ కోవిడ్ టైమ్‌లోనూ సేతుపతి వరుస సినిమాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ఓటీటీల్లో విడుదలవుతుండగా, మరికొన్ని థియేటర్స్‌లో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా ఈ తరుణంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తూ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొహమాటంతో ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవద్దని ఫ్యాన్స్ కొందరు ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే మంచి కంటెంట్ ఉన్న మూవీస్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నారు.
చదవండి: వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ
Comments
Please login to add a commentAdd a comment