'నేను చెప్తేనే నమ్మండి'
యువ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్థంగా ఉన్నాయి. అయితే రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం రోజుకొక కథనం వినిపిస్తోంది. దాంతో చైతూ ఓ క్లారిటీ ఇచ్చాడు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమమ్' సెప్టెంబరులో విడుదల అవుతుందని, ఆడియో ఆగస్టులోనే రిలీజ్ అవుతుందని స్ఫష్టం చేస్తూ ట్వీట్ చేశాడు. కచ్చితమైన తేదీలు ఇంకా ఖరారు కాలేదని, త్వరలో నిర్ణయిస్తారని తెలిపాడు. అలాగే తను చెప్పేవరకు రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి వార్తలు నమ్మొద్దని చెప్పాడు. ప్రేమమ్లో శృతిహాసన్తోపాటు, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం విడుదల కూడా ఈ నెలలోనే ఉండొచ్చని టాక్. ఇక ఈ విషయంపై కూడా చైతూనే క్లారిటీ ఇవ్వాలి.
#Premam coming this September and audio later this month . Hope you like this one pic.twitter.com/P3RZ7mkqYe
— chaitanya akkineni (@chay_akkineni) 9 August 2016
Will post the exact dates as soon as we decide .. Watch this space ! If it's not here .. It's not true :-)
— chaitanya akkineni (@chay_akkineni) 9 August 2016