చైతన్య 'ప్రేమమ్' ఫస్ట్ లుక్..
మళయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' సినిమాను నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ముందు ఈ సినిమాకు 'మజ్ను' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు కానీ.. చివరకు 'ప్రేమమ్'నే ఫైనల్ చేశారు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ను చైతన్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు.
'ప్రేమకథలకు ముగింపు ఉంటుంది.. కానీ అనుభూతులకు ఉండదు' అనే క్యాప్షన్తో వస్తున్నఈ సరికొత్త ప్రేమకథా చిత్రం వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. చైతన్య సరసన శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లు కథానాయికలుగా నటిస్తున్నారు.
Premam it is for #NC12.. Love stories end but feelings dont..Here's the first look to set mood, hope u guys like it! pic.twitter.com/PfD7OT5wiu
— chaitanya akkineni (@chay_akkineni) February 19, 2016