Chaitanya Akkineni
-
ఇప్పుడు ఓటీటీలో బంగార్రాజు.. ఎప్పటి నుంచంటే
అక్కినేని హీరోలు నాగార్జున-నాగ చైతన్యలు నటించిన తాజా చిత్రం 'బంగార్రాజు'. ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. . కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే థియేటర్ రన్ పూర్తిచేసుకున్న‘బంగార్రాజు’చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈరోజు(శుక్రవారం)నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ-అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన సంగతి తెలిసిందే. #Bangarraju will be streaming from 18th Feb exclusively on @ZEE5Telugu. Watch new #ZEE5 trailer ▶️ https://t.co/MWocTlWr0e#BangarrajuOnZEE5 #BangarrajuFromFeb18th#VaasivaadiTassadiyya pic.twitter.com/KDELs4kZeb — chaitanya akkineni (@chay_akkineni) February 17, 2022 -
బిగ్‌బాస్ : ఫినాలేకు అతిథిగా స్టార్ హీరో!
ఏన్నో ఊహగానాల మధ్య మొదలైన బిగ్‌బాస్ నాల్గో సీజన్.. చూస్తుండగానే ముగింపు దశకు చేరింది. కరోనా వల్ల ఈ సారి బిగ్‌బాస్ షో ఉంటుందా లేదా అనే అనుమానాల మధ్య షో అట్టహాసంగా ప్రారంభమై అట్టహాసంగా ప్రారంభమై అందరినీ ఆశ్చర్యపరిచింది. షోలో ఎక్కువగా కొత్త ముఖాలు కనిపించడంతో మొదట్లో కాస్త నెగెటివ్ టాక్ వినిపించినా.. రానురాను షోని ఆసక్తికరంగా మలిచి అందరి కళ్లు బిగ్‌బాస్ హౌస్‌పై పడేలా చేశారు నిర్వాహకులు. ముఖ్యంగా షో ఎండింగ్ వచ్చిన నేపథ్యంలో ఆట మరింత రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్ల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఫైనల్స్‌లో నిలిచేందుకు ఎవరి ఆట వాళ్లు చాలా క్లెవర్‌గా ఆడుతున్నారు. ఇంట్లో అంతా కలిసిమెలిసి ఉన్నప్పటికీ గేమ్‌లో మాత్రం వ్యక్తిగతంగా పోరాడుతూ.. ఫైనల్‌కు వెళ్లేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. (చదవండి : బిగ్‌బాస్: అందుకే అఖిల్ ఏడ్చాడా?) హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరు విజేత అవుతారా అంటే మాత్రం రకరకాలు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరి మించి ఒకరు గేమ్ గట్టిగా ఆడుతున్నారు. అందుకే బిగ్‌బాస్ విజేత ఒకరని చెప్పడం కష్టంగా మారింది. ఇక నాల్గో సీజన్ ఎండింగ్‌కి కొద్ది రోజలు(డిసెంబర్ 20న ఫినాలే జరుగుతుందని అంచనా)మాత్రమే ఉండడంతో షోని గ్రాండ్‌గా కంక్లూడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా ఫైనల్‌కి ఓ స్టార్ హీరోని గెస్ట్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. (చదవండి : బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయల్) బిగ్‌బాస్ మూడో సీజన్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చి మెగా ఫినిషింగ్ ఇచ్చాడు. అంతకు ముందు రెండో సీజన్‌కు విక్టరీ వెంకటేష్ వచ్చి గ్రాండ్ ఎండింగ్ ఇచ్చాడు. అయితే ఈ సారి గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగులో బిగ్‌బాస్ ప్రారంభమైన తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సారి ఫినాలేకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు లేదా అల్లు అర్జున్ వస్తే బాగుంటుందని బిగ్‌బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఫినాలేకు చైతన్య వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సీజన్లో ఇప్పటికే చైతూ భార్య సమంత, తమ్ముడు అఖిల్ సందడి చేశారు. దీపావళి స్పెషల్ గెస్ట్‌గా చైతన్య వస్తారని ఆశించారు. కానీ అది కుదరలేదు. దీంతో ఫినాలేకు చైతన్య, సాయి పల్లవి కలిసి వస్తారని మరో టాక్ వినిపిస్తోంది. మరి ఫినాలేకు గెస్ట్‌గా ఏ స్టార్ వచ్చి సందడి చేస్తాడో చూడాలి మరి. -
'నేను చెప్తేనే నమ్మండి'
యువ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్థంగా ఉన్నాయి. అయితే రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం రోజుకొక కథనం వినిపిస్తోంది. దాంతో చైతూ ఓ క్లారిటీ ఇచ్చాడు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమమ్' సెప్టెంబరులో విడుదల అవుతుందని, ఆడియో ఆగస్టులోనే రిలీజ్ అవుతుందని స్ఫష్టం చేస్తూ ట్వీట్ చేశాడు. కచ్చితమైన తేదీలు ఇంకా ఖరారు కాలేదని, త్వరలో నిర్ణయిస్తారని తెలిపాడు. అలాగే తను చెప్పేవరకు రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి వార్తలు నమ్మొద్దని చెప్పాడు. ప్రేమమ్‌లో శృతిహాసన్‌తోపాటు, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం విడుదల కూడా ఈ నెలలోనే ఉండొచ్చని టాక్. ఇక ఈ విషయంపై కూడా చైతూనే క్లారిటీ ఇవ్వాలి. #Premam coming this September and audio later this month . Hope you like this one pic.twitter.com/P3RZ7mkqYe — chaitanya akkineni (@chay_akkineni) 9 August 2016 Will post the exact dates as soon as we decide .. Watch this space ! If it's not here .. It's not true :-) — chaitanya akkineni (@chay_akkineni) 9 August 2016