
చెర్రీ రేసు నుంచి తప్పుకున్నాడా..?
ధృవ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే దసరాకు రిలీజ్ అంటూ ప్రకటించేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట తప్పబోతున్నాడా..? ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో దసరాకు సినిమా రిలీజ్ అంటూ ప్రకటించినా.. ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ధృవ షూటింగ్తో పాటు చిరంజీవి 150 సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్న చెర్రీ తన సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాడట.
దసరా వరకు షూటింగ్ అయిపోయినా నిర్మాణాంతర కార్యక్రమాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. హడావిడిగా రిలీజ్ చేస్తే సినిమా రిజల్ట్ పై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే వాయిదా వేయటమే కరెక్ట్ అని భావిస్తున్నారట. అంతేకాదు ఇప్పటికే దసరా బరిలో నాలుగు సినిమాలు ప్రకటించటంతో సినిమా వాయిదా వేయటమే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నారు మెగా టీం. అయితే ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. ప్రేమమ్, వీడు గోల్డె హే, మన ఊరి రామాయణం, అభినేత్రి లాంటి సినిమాలు దసరాకే రిలీజ్ ఫిక్స్ చేసుకోవటంతో ధృవను డిసెంబర్కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.