'థ్రిల్లర్ సినిమా చేద్దామనుకున్నాం' | Premam Made Me A Responsible Filmmaker : Chandoo Mondeti | Sakshi
Sakshi News home page

'థ్రిల్లర్ సినిమా చేద్దామనుకున్నాం'

Published Wed, Oct 5 2016 2:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

'థ్రిల్లర్ సినిమా చేద్దామనుకున్నాం'

'థ్రిల్లర్ సినిమా చేద్దామనుకున్నాం'

కార్తీకేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు చందూ మొండేటి తన రెండో సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో నాగచైతన్య హీరోగా రీమేక్ చేసిన చందూ మొండేటి, ఆడియోతో పాటు ట్రైలర్లతోనూ ఆకట్టుకుంటున్నాడు.

అయితే కార్తికేయ సినిమా తరువాత నాగచైతన్యను కలిసిన చందూ, థ్రిల్లర్ సినిమాను చేయాలని భావించాడు. కానీ అదే సమయంలో ప్రేమమ్ సినిమా చూడటంతో ఆ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 7న రిలీజ్ అవుతున్న ప్రేమమ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం ఇచ్చిన హీరో నాగచైతన్య, నిర్మాత నాగవంశీలకు కృతజ్ఞతలు తెలిపిన చందూ మొండేటి, ప్రేమమ్ సినిమా దర్శకుడిగా తన బాధ్యతను పెంచిందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement