క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య | Sept 9 release for Naga Chaitanya's Premam | Sakshi
Sakshi News home page

క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

Published Sat, Aug 20 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలు విడుదల కావడం సర్వ సాధారణమే. కానీ, ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అఫ్‌కోర్స్ ఒకప్పుడు జరిగాయనుకోండి. ఇప్పుడు మాత్రం చాన్సే లేదు. ఈ నేపథ్యంలో పాత ఫీట్ రిపీట్ కాబోతోందా? అనే చర్చ మొదలైంది. ఈ సెప్టెంబర్ 9న అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో అటువంటి అరుదైన సంఘటన జరగబోతుందా? అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది.

చందు మొండేటి దర్శకత్వంలో చైతూ హీరోగా నటించిన ‘ప్రేమమ్’ను సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటిం చారు. ఈ ప్రకటన వచ్చిన కాసేపటికి సెప్టెంబర్ 9వ తేదీనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ను విడుదల చేస్తున్నట్టు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ట్వీట్ చేశారు. దాంతో చైతూ రెండు సినిమాలు ఒకే రోజున రావడం ఖాయం అని చాలామంది అనుకున్నారు.

 కానీ, ఈ విషయం గురించి చైతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సెప్టెంబర్ 9న ‘ప్రేమమ్’ను విడుదల చేసి, కొన్ని వారాల తర్వాత ‘సాహసం శ్వాసగా సాగిపో’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు చైతూ చెప్పారు. ‘ప్రేమమ్’ కంటే ముందే ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రీకరణ పూర్తిచేసినా, పలు కారణాల వల్ల విడుదల ఆలస్యమైందన్నారు. సినిమా నిర్మాణంలో ఏం జరుగుతుందో? ఊహించడం కష్టమన్నారు. మేకింగ్ ఎలా జరిగినా.. ఒక హీరో రెండు సినిమాల విడుదల మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని చైతూ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement