నాగచైతన్యకు డేట్ దొరకటం లేదా..? | Naga Chaitanya movies Not getting Release dates | Sakshi
Sakshi News home page

నాగచైతన్యకు డేట్ దొరకటం లేదా..?

Published Sun, Jul 17 2016 4:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

నాగచైతన్యకు డేట్ దొరకటం లేదా..?

నాగచైతన్యకు డేట్ దొరకటం లేదా..?

ఇటీవల పెళ్లి వార్తలతో సందడి చేస్తున్న నాగచైతన్య తన చేస్తున్న సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం నోరుమెదపటం లేదు. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ పూర్తి కాగా.., మరో సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. అయినా ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ లేదు.

ఏం మాయ చేసావే లాంటి సూపర్ హిట్ అందించిన గౌతమ్ మీనన్ కాంబినేషన్లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సినిమా సాహసం స్వాసగా సాగిపో. ఆడియో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వటం లేదు. ముందుగా జూలైలోనే రిలీజ్ చేయాలని భావించినా కబాలి ఎఫెక్ట్తో వాయిదా వేసుకున్నారు. తరువాత ఆగస్టు 12 రిలీజ్ అంటూ ప్రచారం జరిగినా ఎలాంటి ప్రకటనా రాలేదు.

ఈ సినిమా రిలీజ్ కాకముందే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మళయాల సూపర్ హిట్ రీమేక్ ప్రేమమ్ కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రస్తుతం నార్వేలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ షెడ్యూల్తో షూటింగ్ పూర్తవుతుంది. మరి రెండు సినిమాలను రెడీగా పెట్టిన చైతూ వాటిని ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement