దసరా బరిలో ప్రేమమ్ | Premam release postponed to October | Sakshi
Sakshi News home page

దసరా బరిలో ప్రేమమ్

Published Tue, Aug 23 2016 12:08 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

దసరా బరిలో ప్రేమమ్

దసరా బరిలో ప్రేమమ్

రెండు సినిమాలను రిలీజ్కు రెడీ చేసిన యంగ్ హీరో నాగచైతన్య.. ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఏటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాను ముందు రిలీజ్ చేయాలా..? లేక గ్యారెంటీ హిట్ అన్న నమ్మకం ఉన్న ప్రేమమ్ సినిమాను ముందు రిలీజ్ చేయాలా అన్న విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఫైనల్గా ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో చైతూకు ఓ క్లారిటీ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడటంతో ముందుగా సాహసం శ్వాసగా సాగిపో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక అదే రోజు రిలీజ్ అవుతుందనుకున్న ప్రేమమ్ను ఒక నెల ఆలస్యంగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే ప్రేమమ్ సినిమాకు సంబందించిన ఓ సాంగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా మరో వీడియో సాంగ్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు పుట్టిన రోజున ప్రేమమ్ ఆడియోను గ్రాండ్గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. చైతన్య సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement