ప్రేమేసర్వం | Naga Chaitanya's Premam remake launched | Sakshi

ప్రేమేసర్వం

Nov 28 2015 11:43 PM | Updated on Sep 3 2017 1:10 PM

ప్రేమేసర్వం

ప్రేమేసర్వం

నాగచైతన్య ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ మాగ్జిమమ్ ప్రేమకథా చిత్రాలే. మరోసారి ప్రేమే సర్వస్వంగా భావించే

నాగచైతన్య ఇప్పటివరకూ  చేసిన సినిమాలన్నీ మాగ్జిమమ్ ప్రేమకథా చిత్రాలే.  మరోసారి ప్రేమే సర్వస్వంగా భావించే  ప్రేమికునిగా ఒదిగిపోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అందరితో ప్రేమ మంత్రం జపించేలా చేసి సంచలన విజయం సాధించిన మలయాళ హిట్ ‘ప్రేమమ్’. ఇప్పుడా చిత్రాన్ని  తెలుగులో నాగచైతన్య హీరోగా ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి తెరకెక్కించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రుతీ హాసన్, అనుపమా పరమేశ్వరన్ నాయికలు.  ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో అఖిల్ క్లాప్ ఇచ్చారు. ఈ లవ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 3 నుంచి వైజాగ్‌లో జరగనుంది. సమర్పణ: పీడీవీ ప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement