కోలీవుడ్ ను భయపెడుతున్న ప్రేమమ్ | fear for kollywood movie premam remake on tamil | Sakshi
Sakshi News home page

కోలీవుడ్ ను భయపెడుతున్న ప్రేమమ్

Published Fri, May 20 2016 4:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

కోలీవుడ్ ను భయపెడుతున్న ప్రేమమ్

కోలీవుడ్ ను భయపెడుతున్న ప్రేమమ్

ప్రేమమ్ చిత్రం కోలీవుడ్‌ను భయపెడుతోంది. మలయాళంలో ఘనవిజయాన్ని సాధించిన చిత్రం ప్రేమమ్. ఆ చిత్ర కథానాయికలకిప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్నాయి.ఆ చిత్ర రీమేక్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ప్రేమమ్ చిత్రం తెలుగులో నాగ చైతన్య,శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా రీమేక్ అవుతోంది.అదే విధంగా తమిళంలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడినట్లు తెలిసింది. ప్రేమమ్ చిత్ర రీమేక్ హక్కులను నటుడు ధనుష్ సొంతం చేసుకున్నట్లు విజయ్‌సేతుపతి హీరోగా తమిళంలో నిర్మించడానికి ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఇక శింబు హీరోగా నటించనున్నారనే మరో వెర్షన్ కూడా కోలీవుడ్‌లో ప్రచారం హల్‌చల్ చేసింది.అయితే ఇప్పటి వరకూ ఆ ప్రచారంలో ఏది నిజం కాలేదు. తాజా సమాచారం ఏమిటంటే ప్రేమమ్ రీమేక్‌లో నటించడానికి కోలీవుడ్ హీరోలు భయపడుతున్నారట.

ఈ చిత్రం తమిళనాట ముఖ్యంగా చెన్నైలో పిచ్చపిచ్చగా ఆడేసింది. ఒక్క ఈగ థియేటర్‌లోనే వంద రోజులకు పైగా ప్రదర్శింపబడింది. దీంతో ఆ చిత్రాన్ని తమిళప్రేక్షకులు చాలా వరకూ చూసేవారు. మళ్లీ రీమేక్ చేస్తే చూస్తారో లేదో నన్న భయమే ఆ చిత్రం రీమేక్‌లో నటించడానికి ఇక్కడి హీరోలు సంకోచిస్తున్నట్లు తెలిసింది. ఒక పెద్ద హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి, అందులో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ బదులిస్తూ ప్రేమమ్ చిత్రం కేరళ రాష్ట్రంలో ఎంత విజయం సాధించిందో అంతగా తమిళనాడులోనూ విశేష ప్రేక్షకాదరణను చూరగొందన్నారు. దాన్ని తమిళంలో రీమేక్ చేయాలంటే ఒక్కరి వల్లే సాధ్యం అవుతుందన్నారు. ఒరిజినల్ చిత్ర దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంతోనే దానికి న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.అంతే కానీ ఇతరులెవరూ అలాంటి ప్రయత్నం చేయకూడాదని కూడా సెల్వరాఘవన్ అంటున్నారు.ఆ విధంగా ప్రేమమ్ చిత్రం కోలీవుడ్‌ను భయపెడుతతోందన్న మాట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement