ప్రేమ చేసే మాయలో..! | Shruti Haasan to act in Premam Telugu Remake movie with Naga Chaitanya | Sakshi
Sakshi News home page

ప్రేమ చేసే మాయలో..!

Published Wed, Nov 18 2015 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

ప్రేమ చేసే మాయలో..!

ప్రేమ చేసే మాయలో..!

‘ఏ మాయ చేసావె’ సినిమాతో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకున్న నాగచైతన్య మళ్లీ ఓ ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.  మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’. ఓ యువకుని జీవితంలో జరిగే అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించిన ఈ  చిత్రం ఇప్పుడు నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ కానుంది.

‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో  చైతూ సరసన శ్రుతీహాసన్, అనుపమ కథానాయికలుగా నటించనున్నారు. ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ ‘ప్రేమమ్’ ఓ స్వచ్ఛమైన ప్రేమకథ.

అందరి హృదయాలను హత్తుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మాతృకను మించి హిట్ అయ్యేలా చందూ మొండేటి స్క్రిప్ట్‌ను బాగా తయారు చేశాడు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేశ్ మురుగేశన్, గోపీ సుందర్, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement