సమంత యూ టర్న్ తీసుకుంటున్నారా? లేదా? అనే విషయానికి సమాధానం దొరికేసింది. యస్..! ఈ కొత్త పెళ్లి కూతురు యూ టర్న్ తీసుకుంటున్నారు. యూ టర్న్ అంటే వెనక్కి తీసుకోవడం. ఏ విషయంలో సమంత యూ టర్న్ తీసుకోబోతున్నారని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. కన్నడ హిట్ మూవీ ‘యూ టర్న్’ రీమేక్‌లో ఆమె నటించనున్నారు. అసలు విషయం అది. వాస్తవానికి ఈ సినిమా సమంతకు నచ్చి, తానే నిర్మించాలనుకున్నారని, నటించాలనుకోలేదని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన వచ్చింది. కన్నడ ‘యూ టర్న్’ దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వంలోనే ఈ రీమేక్ రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో తీయనున్నారు. జనవరిలో షూటింగ్ ఆరంభం కానుంది. ‘‘నిజానికి రెండేళ్లుగా ఈ సినిమా కోసం సమంతతో టచ్‌లో ఉన్నాను. ఆమె ఇందులో నటించడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. జనవరిలో షూటింగ్ మొదలుపెడతాం’’ అని పవన్ కుమార్ పేర్కొన్నారు. ఇక.. ‘యూ టర్న్’ కథ విషయానికి వస్తే..
రెండు సినిమాల్లో జర్నలిస్ట్‌గా..
ఓ జర్నలిస్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఫ్లై ఓవర్ మీద క్విక్ యూ టర్న్ తీసుకోవడం కోసం డివైడర్స్‌ని తొలగించిన వాళ్లు ఎలా హత్యకు గురయ్యారు? బాయ్‌ఫ్రెండ్, పోలీస్ సహాయంతో హత్యలు చేస్తున్నవాళ్లను ఆ జర్నలిస్ట్ ఎలా కనిపెట్టింది? అనేది చిత్రకథ. ఆ హత్యల వెనక ఉన్నది మనిషా? దెయ్యమా? అనేది ట్విస్ట్. ఇందులో సమంత జర్నలిస్ట్ పాత్ర చేయనున్నారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సావిత్రి లైఫ్ స్టోరీ ‘మహానటి’లో సమంత జర్నలిస్ట్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘యూ టర్న్’లోనూ అదే పాత్ర. సో.. వచ్చే ఏడాది రెండు జర్నలిస్ట్ పాత్రల్లో ఆమె కనిపించనున్నారన్న మాట.
యూ టర్న్ షురూ!
Published Sat, Dec 9 2017 12:47 AM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment