నాగ చైతన్య స్పీడు.. ఆ హిట్‌ మూవీ రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌! | Buzz: Naga Chaitanya In Maanaadu Remake | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: నాగ చైతన్య స్పీడు.. ఆ హిట్‌ మూవీ రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

Published Sun, Jan 30 2022 4:43 PM | Last Updated on Sun, Jan 30 2022 4:44 PM

Buzz: Naga Chaitanya In Maanaadu Remake - Sakshi

Buzz: Naga Chaitanya In Maanaadu Remake: నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్‌ అందుకున్నాడు. ఇక రాశిఖన్నాతో చేస్తున్న థ్యాంక్యూ మూవీ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు చై.

తాజాగా మానాడు సినిమాతో హిట్‌ కొట్టిన వెంకట్‌ ప్రభుతో ఓ సినిమాకు సైన్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మానాడు రీమేక్‌ రైట్స్‌ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ కొనుగోలు చేశారు. ఇటీవలె ఈ కథను చైకు వినిపించడం, ఆయన కూడా వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అప్‌డేట్‌ రానున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement