టాలీవుడ్లో రొమాంటిక్ సీజన్
సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలు వరుసగా రిలీజ్కు క్యూ కడుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎక్కువగా యాక్షన్, ప్రయోగాత్మక సినిమాలు రిలీజ్ కాగా.. ఇకపై అన్నీ రొమాంటిక్ లవ్ స్టోరీలే రిలీజ్కు రెడీ అవుతున్నాయి. సూపర్ స్టార్ల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఈ తరహా సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మే, జూన్ నెలలో టాలీవుడ్ స్క్రీన్ మీద రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు సందడి చేయనున్నాయి.
మే చివర్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. కుంటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు రాజకుమారుడు. ఇదే తరహా కథాంశంతో తెరకెక్కిన త్రివిక్రమ్, నితిన్ల 'అ.. ఆ..' కూడా మరో రెండు వారాల్లో రిలీజ్కు రెడీ అవుతోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది.
నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మళయాల సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్ కూడా మరో నెలరోజుల్లో రిలీజ్కు రెడీ కానుంది. ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తొలిసారి మెగాఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నీహారిక తొలి సినిమా ఒక్క మనసు కూడా భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కూడా క్యూట్ లవ్ స్టోరీ అన్న టాక్ వినిపిస్తోంది.