
'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారు
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారయ్యింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'ప్రేమమ్' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర టీం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చైతన్య సరసన శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబరు 20వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'ఎవరే' పాట యూత్ను విశేషంగా ఆకట్టుకుంటోంది.