
మహర్షెల్లా అలీ
అమెరికన్ నటుడు మహర్షెల్లా అలీ ఇక ఆకాశవీధిలో విహరించనున్నారట. మార్క్ ముండెన్ దర్శకత్వంలో హాలీవుడ్‌లో ‘సావరిన్’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి అలీ అంగీకరించారు. 21ల్యాప్స్ ఎంటర్‌టైన్మెంట్, ఈ వన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాం.
ఇందులో లీడ్ యాక్టర్‌గా ప్రతిభావంతుడైన మహర్షెలా అలీ దొరికినందుకు హ్యాపీగా ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన నిక్ మేయర్ తెలిపారు. ‘ఏ క్వైట్ ప్లేస్’ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన స్కాట్ బేక్, బ్రియాన్ వుడ్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘గ్రీన్‌బుక్’లోని నటనకు గాను మహర్షెల్లా ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 2016లో ‘మూన్‌లైట్’కి ఇదే విభాగంలో అవార్డు అందుకున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment