Sovereign
-
క్యూబ్ హైవేస్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బ్రిటిష్ కొలంబియా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్, అబుధాబి సావరిన్ సంస్థ ముబడాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తదితరాల నుంచి క్యూబ్ హైవేస్ ట్రస్ట్ 63 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 5,226 కోట్లు) సమీకరించింది. ఇన్విట్కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అయిన క్యూబ్ హైవేస్ ఫండ్ అడ్వయిజర్స్ ప్రయివేట్ లిమిటెడ్ నిధుల సమీకరణ అంశాన్ని వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ కింద జారీ చేసిన ఇన్విట్ సాధారణ యూనిట్లను లిస్టింగ్ చేసినట్లు పేర్కొంది. దేశీయంగా లిస్టయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్).. క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌లో కెనడియన్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ బీసీఐ, ముబడాలతోపాటు మరికొన్ని దేశీ సంస్థలు కొత్త యాంకర్ ఇన్వెస్టర్లుగా నమోదైనట్లు తెలియజేసింది. 18 ఆస్తులు క్యూబ్ హైవేస్ ఇన్విట్ దాదాపు 1,424 కిలోమీటర్ల పొడవైన 18 టోల్, యాన్యుటీ రోడ్ ఆస్తులను కలిగి ఉంది. వీటిలో 17 ఎన్హెచ్ఏఐ టోల్ రోడ్ ఆస్తులుకాగా.. ఒకటి ఎన్హెచ్ఏఐ యాన్యుటీ రోడ్ ప్రాజెక్టుగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, హర్యానా తదితర 11 రాష్టాలలో రోడ్ ప్రాజెక్టులు విస్తరించినట్లు తెలియజేసింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ నుంచి రూ. 10,000 కోట్ల రుణ సౌకర్యాలను పొందేందుకు సంతకాలు జరిగినట్లు క్యూబ్ హైవేస్ ఇన్విట్ పేర్కొంది. ప్రస్తుత రుణాల రీఫైనాన్సింగ్‌కు నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. -
అదానీ గ్రూప్ కంపెనీకి ‘రేటింగ్’ అప్‌గ్రేడ్?
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ కంపెనీల్లో ఒకదానికి త్వరలో భారతదేశ సావరిన్ (సార్వభౌమ) రేటింగ్ కంటే (బీబీబీ–) ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్ సింగ్ (రాబీ) తాజా గ్రూప్ ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ కంపెనీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జరిగితే అదానీ గ్రూప్‌లోని ఒక కంపెనీకి మొట్టమొదటిసారి భారత్ సావరిన్ రేటింగ్ కంటే ఎక్కువ రేటింగ్ లభించినట్లవుతుంది. భారత్ దేశానికి ఎస్అండ్పీ, ఫిచ్ వంటి అంతర్జాతీయ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఇస్తున్న ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీబీబీ–’ చెత్త రేటింగ్‌కు ఒక అంచె ఎక్కువ. ప్రభుత్వరంగంసహా దేశంలోని పలు కంపెనీలకు ఈ రేటింగ్ సమానమైన లేదా ఇంతకంటే తక్కువ రేటింగ్‌ను కలిగిఉన్నాయి. గత ఏడాది రిలయన్స్ రేటింగ్స్ పెంపు గత ఏడాది జూన్ 24వ తేదీన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్స్‌ను ‘బీబీబీ–’ నుంచి ఒక అంచ– బీబీబీకి అప్‌గ్రేడ్ చేస్తూ ఫిచ్ రేటింగ్స్ నిర్ణయం తీసుకుంది. సంస్థ రుణ పరిస్థితులు మెరుగుపడ్డం దీనికి కారణం. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి. ఇందులో అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌కు భారత్ సావరిన్ రేటింగ్‌కు సమానమైన రేటింగ్ ఉంది. ఫిచ్ ‘బీబీబీ– (నెగటివ్ అవుట్‌లుక్) సంస్థకు ఉంది. ఎస్అండ్పీ ‘బీబీబీ–’ రేటింగ్‌ను ఇస్తోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్‌ను ఇస్తోంది. ఈ మూడు సంస్థలు భారత్‌కు కూడా ఇదే విధమైన రేటింగ్‌ను అందిస్తున్నాయి. ఇది చెత్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ. గ్రూప్ పునరుత్పాదక ఇంధన విభాగంఅదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు కూడా భారతదేశ సావరిన్ రేటింగ్‌కు సమానమైన రేటింగ్ ఉంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కంపెనీ చేసిన విజ్ఞప్తిపై ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌కు గురువారం తన రేటింగ్‌ను ఉపసంహరించుకుంది. కాగా, తాజా వార్తలపై స్పందనకుగాను పంపిన ఈ మెయిల్ ప్రశ్నకు అదానీ గ్రూప్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. రేటింగ్ అంటే... ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే. -
భారత్ సావరిన్ రేటింగ్ యథాతథం
Fitch affirms India's sovereign rating: భారత్ సావరిన్ రేటింగ్‌ను యథాతథంగా నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ వద్ద కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్జజ సంస్థ– ఫిచ్ మంగళవారం స్పష్టం చేసింది. మధ్య కాలికంగా వృద్ధికి అవరోధాలు తగ్గినట్లు కూడా పేర్కొంది. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా దేశానికి ఉన్న దాదాపు 600కుపైగా బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలను ప్రస్తావించింది. ప్రభుత్వ రుణ భారం, బలహీన ఫైనాన్షియల్ వ్యవస్థ, వ్యవస్థాగత అంశాలకు సంబంధించి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ దేశం వీటిని తట్టుకుని నిలబడగలదని పేర్కొంది. కోవిడ్–19 సవాళ్ల నుంచి దేశం వేగంగా రికవరీ అవుతోందని, మధ్య కాలిక వృద్ధి పటిష్టతకు, ఫైనాన్షియల్ రంగంపై ఒత్తిడి తగ్గడానికి ఆయా అంశాలు దోహదపడతాయని వివరించింది. 8.7 శాతం వృద్ధి అంచనా 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం 8.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలను ఫిచ్ వెలువరించింది. 2023 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10 శాతానికి చేరుతుందని అంచనావేసింది. మెబిలిటీసహా పలు ఇండికేటర్లు కరోనా సవాళ్ల ముందస్తు స్థాయికి చేరుతున్నాయని పేర్కొంది. కోవిడ్–19 కేసులు పెరిగినప్పటికీ, దీనవల్ల నష్టం గతంలో కన్నా తక్కువగానే ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించింది. విస్తృత వ్యాక్సినేషన్ దీనికి కారణమని తెలిపింది. చెత్త రేటింగ్‌కు ఒక అంచె ఎక్కువ... ప్రస్తుతం ఫిచ్ దేశానికి ఇస్తున్న రేటు చెత్త (జంక్) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ అక్టోబర్‌లో పేర్కొంది. ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలకు సవాళ్లు తగ్గడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే సావరిన్ రేటింగ్‌ను మాత్రం యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. ఇది కూడా జంక్ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచె ఎక్కువ. 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. మరో రేటింగ్ దిగ్గజ సంస్థలు ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తోంది. భారత్ దిగ్గజ రేటింగ్ సంస్థల రేటింగ్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. ప్రాముఖ్యత ఎందుకు? అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతి యేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు. - న్యూఢిల్లీ -
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు
కైరో: ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రిని అదుపులోకి తీసుకున్న సైన్యం..దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు గడువు సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం దేశ పరిపాల నాబాధ్యతలను నిర్వహిస్తున్న సార్వభౌమత్వ (సావరిన్) కౌన్సిల్‌ను రద్దు చేయడంతోపాటు ప్రధానమంత్రి అబ్దుల్లా హర్దోక్‌ను పదవీచ్యుతుడిని చేస్తున్నట్లు జనరల్ అబ్దుల్ ఫతా బుర్హాన్ చేసిన ప్రకటన టీవీ చానెళ్లలో ప్రసారమైంది. రాజకీయ పక్షాల మధ్య కొనసాగుతున్న విభేదాల వల్లే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా తెలిపారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. సైనిక తిరుగుబాటు వార్తలతో ఆగ్రహించిన ప్రజలు పెద్ద సంఖ్యలో రాజధాని ఖార్తూమ్ వీధుల్లోకి చేరుకున్నారు.టైర్లకు నిప్పుపెట్టి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా బలగాలు వారిని చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా 80 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం నియంత ఒమర్ అల్ బషీర్‌ను పదవి నుంచి తొలగించాక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టేందుకు మిలటరీ అధికారులు, పౌర నేతలతో ఉన్నత స్థాయి కౌన్సిల్ ఏర్పాటుతోపాటు ఆపద్ధర్మ ప్రధానమంత్రిని నియమించారు. ప్రజా ప్రభుత్వా నికి నవంబర్‌లో అధికారం అప్పగించాల్సి ఉంది. -
రిలయన్స్ రిటైల్ జోరు..
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ తర్వాత తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లోకి (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అబుధాబికి చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ ముబాదలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ 1.4 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. ఇందుకుగాను ముబాదలా రూ. 6,247.5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించింది. రిలయన్స్ గ్రూప్‌లో ఈ సంస్థకు ఇది రెండో ఇన్వెస్ట్మెంట్. ముబాదలా ఇప్పటికే రూ. 9,093.6 కోట్లతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.85 శాతం వాటా కొనుగోలు చేసింది. ‘ముబాదలా వంటి దిగ్గజ సంస్థతో భాగస్వామ్యం మాకు గణనీయంగా ఉపయోగపడనుంది. భారత రిటైల్ రంగంలో లక్షల సంఖ్యలో చిన్న రిటైలర్లు, వ్యాపారులకు తోడ్పాటునివ్వాలన్న మా సంకల్పంపై ముబాదలాకు ఉన్న నమ్మకానికి ఈ పెట్టుబడులు నిదర్శనం. మా లక్ష్య సాధనలో ఆ సంస్థ పెట్టుబడులు, మార్గదర్శకత్వం ఎంతగానో తోడ్పడగలవు‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ‘ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడుల ద్వారా రిలయన్స్‌తో భాగస్వామ్యం మరింత పటిష్టమైంది.’ అని ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్ తెలిపారు. మూడు వారాల్లో అయిదో డీల్.. గడిచిన మూడు వారాల్లో ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడులకు సంబంధించి ఇది అయిదో డీల్. అమెరికాకు చెందిన కేకేఆర్ అండ్ కంపెనీ రూ. 5,550 కోట్లు (1.28 శాతం వాటా), ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ. 3,675 కోట్లు (0.84 శాతం వాటా) ఇన్వెస్ట్ చేశాయి. ఇవిగాకుండా సిల్వర్ లేక్ రెండు విడతలుగా మొత్తం రూ. 9,375 కోట్లు పెట్టుబడులు (2.13 శాతం వాటా) పెట్టింది. వీటి ప్రకారం రిలయన్స్ రిటైల్ వేల్యుయేషన్ దాదాపు రూ. 4.29 లక్షల కోట్లుగా ఉండనుంది. సెప్టెంబర్ నుంచి చూస్తే రిటైల్ విభాగంలో 5.65 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ ఇప్పటిదాకా రూ. 24,847.5 కోట్లు సమీకరించినట్లయింది. -
సైన్స్ ఫిక్షన్లో...
అమెరికన్ నటుడు మహర్షెల్లా అలీ ఇక ఆకాశవీధిలో విహరించనున్నారట. మార్క్ ముండెన్ దర్శకత్వంలో హాలీవుడ్లో ‘సావరిన్’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి అలీ అంగీకరించారు. 21ల్యాప్స్ ఎంటర్టైన్మెంట్, ఈ వన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. ఇందులో లీడ్ యాక్టర్‌గా ప్రతిభావంతుడైన మహర్షెలా అలీ దొరికినందుకు హ్యాపీగా ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన నిక్ మేయర్ తెలిపారు. ‘ఏ క్వైట్ ప్లేస్’ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన స్కాట్ బేక్, బ్రియాన్ వుడ్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘గ్రీన్‌బుక్’లోని నటనకు గాను మహర్షెల్లా ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 2016లో ‘మూన్లైట్’కి ఇదే విభాగంలో అవార్డు అందుకున్నారాయన. -
మూడవ విడత గోల్డ్ బాండ్ స్కీమ్
తగ్గిన స్పందన! న్యూఢిల్లీ: మూడవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్బీజీ) స్కీమ్‌కు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. దాదాపు రూ.329 కోట్ల విలువైన 1,128 కేజీలకు మాత్రమే డిమాండ్ వచ్చింది. రెండవ విడతతో పోల్చితే ఈ డిమాండ్ దాదాపు సగమే కావడం గమనార్హం. మూడు విడతలూ కలిసి రూ.1,322 కోట్ల విలువ రూ.4,916 కేజీలకు సబ్స్క్రిప్షన్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడించాయి. మార్చి 8వ తేదీ నుంచి 14వతేదీ వరకూ మూడవ విడత స్కీమ్ అమలయ్యింది. తొలి సమాచారం ప్రకారం 64,000 మంది నుంచి దరఖాస్తులు అందాయి. బాండ్లు మార్చి 29న జారీ అవుతాయి. 2015 నవంబర్‌లో 916 కేజీలు, ఈ జనవరిలో 2,872 కేజీలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. గోల్డ్ స్కీమ్ విజయానికి కసరత్తు... మరోవైపు గోల్డ్ డిపాజిట్ పథకం విజయవంతం చేయడానికి కేంద్ర కసరత్తు చేస్తోంది. దాదాపు 800 బిలియన్ డాలర్ల విలువ చేసే 20,000 టన్నుల బంగారం బీరువాలకు పరిమితమవుతోందని, దీనిలో సగాన్నైనా మార్కెట్లోకి తీసుకురావాలని భావించిన కేంద్రానికి తీవ్ర నిరాశే ఎదురయ్యింది. కేవలం 3 టన్నుల డిపాజిట్ మాత్రమే ఇప్పటివరకూ నమోదైంది. మరోవైపు, దాదాపు 44 కేజీల బంగారాన్ని.. గోల్డ్ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని యోచిస్తున్నట్లు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయం వర్గాలు తెలిపాయి. ఇందుకోసం వివిధ బ్యాంకుల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, వచ్చే వారం అధికారిక ప్రకటన రాగలదని పేర్కొన్నాయి. సిద్ధి వినాయక దేవాలయం వద్ద దాదాపు 160 కేజీల బంగారం ఉన్నట్లు అంచనా. -
'పార్లమెంట్ సర్వాధికారి కాదు'
కొచ్చి: పార్లమెంటు తీసుకున్నవే తుది నిర్ణయాలు కాదని, కోర్టుల్లో సవాలు చేయొచ్చని ఎన్‌జేఏసీ చట్టాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ న్యాయవాది, బీజేపీ మాజీ నేత రాంజెఠ్మలానీ అన్నారు. 'జాతీయ న్యాయ నియామకాల కమిషన్' చట్టాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించడాన్ని తప్పు పట్టారు. గత అవీనితి ప్రభుత్వం, ప్రస్తుత అవినీతి సర్కారు ఏకాభిప్రాయ ఉత్పత్తిగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ను జెఠ్మలానీ వర్ణించారు. కొచ్చిలో ఆదివారం జరిగిన 1860 ఇండియన్ పీనల్ కోడ్ 155 వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటే సర్వాధికారి కాదని ఆయన స్పష్టం చేశారు. 'పార్లమెంటే సర్వాధికారా అని ఏ రాజకీయ నాయకుడినైనా అడగండి. ముఖ్యంగా ప్రధానమంత్రిని ప్రశ్నించండి. పార్లమెంటే సర్వధికారి కాదని ఎల్ ఎల్ బీ చదువుకున్న వారందరికీ తెలుసు' అని జెఠ్మలానీ అన్నారు. -
సర్వాధికారాలు రమేష్‌బాబుకే
పట్టిసీమపై ప్రభుత్వ నిర్ణయం చీఫ్ ఇంజనీర్ పోస్టు సృష్టించి అదనపు బాధ్యతలు ప్రతిపాదనలకు మంత్రి దేవినేని ఆమోదం హైదరాబాద్: పట్టిసీమ పనుల్లో అక్రమాలు వెలుగుచూడకుండా, ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు అడ్డగోలు బిల్లుల మంజూరు కోసం పోలవరం ఎస్ఈ రమేష్‌బాబుకు ఆ పథకంపై సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. పట్టిసీమ చీఫ్ ఇంజనీర్ పోస్టు సృష్టించి, ఆయనకు సీఈగా అదనపు బాధ్యతలు అప్పగించాలంటూ రూపొందించిన ప్రతిపాదనలకు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు వెలువడతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వులు వచ్చిన మరుక్షణం నుంచి ఈఎన్సీతో సంబంధం లేకుండా పట్టిసీమ డిజైన్‌లో మార్పులు చేర్పు లు, పనుల పర్యవేక్షణ, నాణ్యత తనిఖీ, బిల్లు లు పాస్ చేయడం వంటి అన్ని రకాల అధికారాలు రమేష్‌బాబుకే దక్కుతాయన్నాయి. ఈఎన్సీని బైపాస్ చేసి..: పోలవరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్ (సీఈ) పోస్టు కాకుండా ఈఎన్సీ పోస్టు ఉంటుంది. రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీనే పోలవరం సీఈగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పట్టిసీమ డిజైన్‌లో మార్పు చేర్పుల ప్రతిపాదనలు ఈఎన్సీ ద్వారానే ప్రభుత్వానికి చేరా లి. బిల్లుల చెల్లింపునకు కూడా ఈఎన్సీ ఆమోదం తప్పనిసరి. కాంట్రాక్టర్‌కు నచ్చినట్లుగా డిజైన్ మార్చడానికి, పనులు చేయకపోయినా చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు మంజూరు చేయడానికి ఈఎన్సీ అడ్డుపడుతున్నారని నీటి పారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈఎన్సీని బైపాస్ చేసి బిల్లులు నొక్కేసేందుకు వీలుగా బాధ్యతలన్నీ రమేష్‌బాబుకు అప్పగించారని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా పట్టిసీమ సీఈ పోస్టు సృష్టించడం ద్వారా ఈఎన్సీని వ్యూహాత్మకంగా పక్కకు తప్పించారని ఇంజనీర్లు చెబుతున్నారు. పట్టిసీమ సీమ సీఈగా ఎత్తిపోతల పథకం పనులను రమేష్‌బాబు పర్యవేక్షించనున్నారు. ఎంత పరిమాణంలో పని జరిగిందనే విషయాన్ని ఆయన సర్టిఫై చేయనున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ సీఈగా నాణ్యతను తనిఖీ చేస్తారు. పోలవరం ఎస్ఈగా బిల్లులను పాస్ చేస్తారు. ఏ టూ జెడ్ పనులు ఒక్కరికే అప్పగించడంతో, పనులు చేయకున్నా చేశామని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేయడానికి వీలుగానే ఈ ఏర్పాట్లు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి పారుదల శాఖలో సమర్థులైన ఇంజనీర్లందరినీ పక్కనబెట్టి రమేష్‌బాబుకు బాధ్యతలు అప్పగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు.