
సాక్షి, సినిమా : దేశంలోని తొలి స్పేస్ చిత్రం టిక్ టిక్ టిక్ ట్రైలర్ వచ్చేసింది. కోలీవుడ్‌లో జయం రవి హీరోగా శక్తి సౌందర్ రాజన్ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అంతరిక్షం నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు విజువల్స్ చూస్తే అర్థమౌతోంది.
భారతదేశానికి పొంచి ఉన్న ముప్పు.. దానిని అడ్డుకునేందుకు అంతరిక్ష శాఖ అధికారులు మేజిషియన్ అయిన హీరో సాయం తీసుకోవటం.. ఓ బృందంగా అంతరిక్షంలోకి వెళ్లి శత్రువులతో పోరాటం నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కింది. గ్రాఫిక్స్ వర్క్ కూడా ఆసక్తికరంగానే ఉంది. నివేథా పెతురాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రయోగాత‍్మక చిత్రాలకు ముందుండే జయం రవి నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమానే రాబోతుందని స్పష్టమౌతోంది. కాగా, టిక్ టిక్ టిక్ రిలీజ్ తేదీ ప్రకటించాల్సి ఉంది. గతంలో రవి-రాజన్ కాంబినేషన్‌లో మిరుథన్(తెలుగులో యమపాశం) జాంబీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Ecstatic to present to u #TikTikTikTrailer https://t.co/04VSUYdyg0 #FirstIndianSpaceFilm #FirstAsianSpaceFilm 💥💥💥God bless the entire team! @ShaktiRajan @JabaksMovies @immancomposer @madhankarky @NPethuraj
— Jayam Ravi (@actor_jayamravi) November 24, 2017
Comments
Please login to add a commentAdd a comment