
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా రూపొందిన తమిళ చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తీ సౌందర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ ‘టిక్ టిక్ టిక్’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘టీజర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీని తలపిస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రావడం గొప్ప విషయం.
ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు. సమర్పకుల్లో ఒకరైన లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో వచ్చిన ‘బిచ్చగాడు, 16’ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మరో విభిన్నమైన ‘టిక్ టిక్ టిక్’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మంచి టెక్నికల్ అంశాలతో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. తొలి ఇండియన్ స్పేస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, పాటలు: వెన్నెలకంటి, రాకేందు మౌళి, కెమెరా: వెంకటేశ్.
Comments
Please login to add a commentAdd a comment