
విభిన్నమైన చిత్రాలతో ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. తమిళంలో విజయ్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా రిలీజై మంచి విజయాలు సాధిస్తున్నాయి. ‘డాక్టర్ సలీమ్, బిచ్చగాడు’ ఇందుకు నిదర్శనం. తాజాగా విజయ్ ఆంటోని హీరోగా గణేష దర్శకత్వంలో తమిళంలో ఓ సినిమా రూపొందుతోంది.
ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాత. ఇందులో నివేథా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్నారు. మంగళవారం విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా తమిళంలో ఈ సినిమాకు ‘తిమిరుపుడిచ్చవన్’ (అంటే పొగరున్నోడు అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. ‘‘ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోని నటిస్తున్నారు. త్వరలోనే తెలుగు టైటిల్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment