సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు' | Bichagadu Tamil Version creates sensation as Highest TRP recorded | Sakshi
Sakshi News home page

సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు'

Published Sat, Nov 26 2016 12:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు'

సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు'

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా పిచ్చైక్కారన్ను తెలుగులో బిచ్చగాడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. కోటి రూపాయల లోపు బడ్జెట్తో తెలుగులో రిలీజ్ అయిన బిచ్చగాడు వందల రెట్లు కలెక్షన్లు సాధించి ఈ ఏడాది టాప్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా కాసుల పంట పండించాడు.

ఇటీవల ఓ తెలుగు టివి ఛానల్లో ప్రసారం అయిన బిచ్చగాడు 18.75 టీఆర్పీ సాధించింది. పవన్ చివరి సినిమా సర్థార్ గబ్బర్సింగ్ కన్నా బిచ్చగాడు టీఆర్పీ ఎక్కువ కావడం విశేషం. ఈ సినిమా తమిళ వర్షన్ అయితే టీఆర్పీ రికార్డ్లలో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్గా నిలిచింది. ఓ తమిళ ఛానల్లో ప్రసారం అయిన పిచ్చైకారన్  24.55 టీఆర్పీ సాధించి సంచలనం సృష్టించింది. రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ లాంటి టాప్ స్టార్ల సినిమాలతో పాటు, బాహుబలి టీఆర్పీలను కూడా వెనక్కి నెట్టి బిచ్చగాడు సంచలనం సృష్టించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement