Pichaikkaran
-
బిచ్చగాడు 2: బికిలి బికిలి అంటూ గొంతెత్తిన హీరో
‘వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి...’ అంటూ పాడారు విజయ్ ఆంటోని. 2016లో విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పిచ్చైక్కారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శశి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ వస్తోంది. విజయ్ ఆంటోని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బికిలి’ అనే పాట మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు. భాష్యశ్రీ రాసిన ఈ పాటకు మ్యూజిక్ కంపోజింగ్, సింగర్ విజయ్ ఆంటోనీయే కావడం విశేషం. ఇక పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన ధనబలంతో వారిని బానిసలుగా చేసి, డబ్బు ఉందన్న అహంకారంతో తిరిగేవాళ్లకు తాను బికిలీ అని పేరు పెట్టినట్లు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. -
బిచ్చగాడు మళ్లీ వస్తున్నాడు
తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిచ్చైకారన్’. తెలుగులో ‘బిచ్చగాడు’గా అనువాదమై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం కాబోతున్నట్టు ప్రకటించారు విజయ్ ఆంటోని. సీక్వెల్‌కి సంబంధించిన కథను ఆయనే రాస్తున్నారు. ఆల్రెడీ నాలుగు నెలలుగా ఈ కథ మీద పని చేస్తున్నట్టు తెలిపారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన శశి ఈ సీక్వెల్‌కి దర్శకత్వం చేయరట. ఈ సీక్వెల్‌ను నిర్మించడంతో పాటు సంగీత దర్శకత్వం కూడా వహిస్తారట విజయ్ ఆంటోని. నిజానికి ముందు సంగీతదర్శకుడిగానే ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోగా మారి, సినిమాలు చేస్తున్నారు. తాను నటించే సినిమాలను దాదాపు తానే నిర్మిస్తున్నారు కూడా. అలా నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ‘బిచ్చగాడు’కి సీక్వెల్‌కి కథ రాస్తూ, కథారచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకోబోతున్నారు. -
సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు'
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా పిచ్చైక్కారన్ను తెలుగులో బిచ్చగాడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. కోటి రూపాయల లోపు బడ్జెట్‌తో తెలుగులో రిలీజ్ అయిన బిచ్చగాడు వందల రెట్లు కలెక్షన్లు సాధించి ఈ ఏడాది టాప్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా కాసుల పంట పండించాడు. ఇటీవల ఓ తెలుగు టివి ఛానల్లో ప్రసారం అయిన బిచ్చగాడు 18.75 టీఆర్పీ సాధించింది. పవన్ చివరి సినిమా సర్థార్ గబ్బర్‌సింగ్ కన్నా బిచ్చగాడు టీఆర్పీ ఎక్కువ కావడం విశేషం. ఈ సినిమా తమిళ వర్షన్ అయితే టీఆర్పీ రికార్డ్‌లలో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఓ తమిళ ఛానల్లో ప్రసారం అయిన పిచ్చైకారన్ 24.55 టీఆర్పీ సాధించి సంచలనం సృష్టించింది. రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ లాంటి టాప్ స్టార్ల సినిమాలతో పాటు, బాహుబలి టీఆర్పీలను కూడా వెనక్కి నెట్టి బిచ్చగాడు సంచలనం సృష్టించాడు. -
పిచ్చైక్కారన్‌కు పన్ను మినహాయింపు
ఇప్పుడు యూ సర్టిఫికెట్ పొందిన చిత్రాలకే రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు పొందడం గగనం అయిపోతోంది. అలాంటిది పిచ్చైక్కారన్ చిత్రం ఏకంగా వినోదపు పన్ను మినహాయింపు అర్హతను పొందడం విశేషం అనే చెప్పాలి. సాధారణంగా మంచి సందేశంతో కూడిన అతి కొద్ది చిత్రాలకే ప్రభుత్వం వినోదపు పన్నును రద్దు చేస్తుంది. అలాంటిది కమర్షియల్ అంశాలతో కూడిన పిచ్చైక్కారన్ చిత్రం ఈ కేటగిరీలో చేరడం చెప్పకోదగ్గ విషయం. సంగీత దర్శకుడు విజయ్ఆంటోనీ హీరోగా నటించి, సంగీతాన్ని అందించి తన విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన చిత్రం పిచ్చైక్కారన్. డిష్యుం చిత్రంతో విజయ్‌ఆంటోనిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన శశి ఈ చిత్రానికి దర్శకుడు. సాట్నా టిటూస్, భగవతి పెరుమాళ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికెట్‌ను పొంది శుక్రవారం తెరపైకి రానుంది. దీని విడుదల హక్కుల్ని ఆర్కే.ఫిలింస్, స్కైలార్క్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు పొందా యి. కాగా కమర్షియల్ చిత్రంగా రూపొందిన పిచ్చైక్కారన్‌కు ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయిం పునిచ్చిందని ఆర్కే.ఫిలింస్ అధినేతలలో ఒకరైన శరవణన్ వెల్లడించారు.