ఆ సినిమా రానా చేయాల్సిందట..! | Rana refused to act in Bichagadu Remake | Sakshi
Sakshi News home page

ఆ సినిమా రానా చేయాల్సిందట..!

Published Sat, Jun 11 2016 9:56 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

ఆ సినిమా రానా చేయాల్సిందట..! - Sakshi

ఆ సినిమా రానా చేయాల్సిందట..!

సర్దార్ గబ్బర్సింగ్, బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సమయంలో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయి తెలుగునాట సంచలన విజయం సాధించిన సినిమా బిచ్చగాడు. తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా కేవలం మౌత్ టాక్ తోనే మంచి వసూళ్లను సాధించింది.

అయితే తమిళ్లో తెరకెక్కిన ఈ సినిమాను ముందు తెలుగులో రానా హీరోగా రీమేక్ చేయాలని భావించారు. అయితే సినిమా చూసిన రానా, తన ఇమేజ్కు, ఫిజిక్కు ఈ పాత్ర సరిపోదని భావించి నో చెప్పేశాడు. దీంతో తమిళ నిర్మాతలు అదే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమానే తెలుగు స్ట్రయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను సాధిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement