
బిచ్చగాడిగా సుదీప్
ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయిన బిచ్చగాడు, తమిళ్తో పాటు తెలుగు నాట కూడా ఘనవిజయం సాధించింది. అలాంటి టైటిల్ పెట్టాడానికే సాహసించని టాలీవుడ్లో భారీ హిట్తో అలరించింది. దీంతో ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల నుంచి బిచ్చగాడికి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్లో సైతం ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
మరో అడుగు ముందుకేసిన సాండల్ వుడ్ దర్శక నిర్మాతలు.. సుదీప్ హీరోగా సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రీమేక్ సినిమాలతో మంచి విజయాలను సాధించిన సుదీప్ మరోసారి అదే ఫార్ములాతో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే రైట్స్ సొంతం చేసుకున్న కన్నడ నిర్మాతలు త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.