
రామ్, మాళవికా శర్మ
సంక్రాంతి రేసులో నిలవడానికి పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో రామ్ ‘రెడ్’ సినిమా ఒకటి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. రవికిశోర్ మాట్లాడుతూ – ‘‘దేవదాసు’, ‘మస్కా’ తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. మా సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని.
Comments
Please login to add a commentAdd a comment